Hyderabad Metro | హైదరాబాద్ : హైదరాబాద్ మెట్రో రైలులో ఇటీవలే సాంకేతిక లోపం ఏర్పడిన విషయం తెలిసిందే. అయితే తాజాగా మెట్రో రైలులో మరోసారి సాంకేతి లోపం తలెత్తింది. సాంకేతిక లోపంతో మెట్రో రైలు జూబ్లీ హిల్స్ చెక్పోస్ట్ స్టేషన్ వద్ద నిలిచిపోయింది. దాదాపు 10 నిమిషాలపాటు రైలు ఆగిపోవడంతో ఆయా మార్గాల్లో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ప్రయాణికులు ఇబ్బందికి లోనయ్యారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
కాగా రీసెంట్గా భరత్ నగర్ మెట్రో స్టేషన్ మధ్య మెట్రో రైలు 8 నిమిషాల పాటు ఆగిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. సాంకేతిక సమస్యల వల్లనే రైలు ఆగిపోయిందని మెట్రో రైలు అధికారులు పేర్కొన్నారు.
మరోసారి సాంకేతిక లోపంతో ఆగిపోయిన హైదరాబాద్ మెట్రో రైలు
జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ స్టేషన్ వద్ద దాదాపు 10 నిమిషాలు నిలిచిపోయిన మెట్రో రైలు pic.twitter.com/5YTyFTwCYG
— Telugu Scribe (@TeluguScribe) March 30, 2026
Nithiin | లీడింగ్ బ్యానర్లో నితిన్ కొత్త సినిమా.. ఈసారైనా హిట్టు పడేనా..?
Hardik Pandya: మహికా శర్మకు 1.7 కోట్ల ఖరీదైన కారు గిఫ్ట్ ఇచ్చిన హార్దిక్ పాండ్యా