Hyderabad | హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఓ వ్యక్తి వీరంగం సృష్టించారు. రోడ్డు ఆక్రమణను అడ్డుకున్న టౌన్‌ప్లానింగ్ అధికారులను కత్తితో బెదిరించాడు. తన జోలికి వస్తే నరికేస్తానని రోడ్డు మీదే వార్నింగ్ ఇచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
వివరాల్లోకి వెళ్తే.. బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 12లోని ఎమ్మెల్యే కాలనీలో ఓ వ్యక్తి రోడ్డును ఆక్రమించి ప్రహారీ గోడ నిర్మిస్తున్నట్లు జీహెచ్ఎంసీ, టౌన్ ప్లానింగ్ అధికారులకు ఇటీవల స్థానికులు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుతో శుక్రవారం నాడు పరిశీలనకు టౌన్ ప్లానింగ్ అధికారులు వచ్చారు. ఈ నేపథ్యంలో నూకారపు రామకృష్ణ అనే వ్యక్తి టౌన్ ప్లానింగ్ అధికారులతో వాగ్వాదానికి దిగాడు. అంతటితో ఆగకుండా కారులో నుంచి కత్తిని తీసుకొచ్చి.. ప్రహారీ నిర్మాణాన్ని అడ్డుకున్న అధికారులను నరికేస్తానని బెదిరించాడు. కాగా, టౌన్ ప్లానింగ్ సిబ్బంది ఫిర్యాదుతో ఘటనాస్థలికి వచ్చిన ఫిలింనగర్ పోలీసులు సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.
నా జోలికి వస్తే నరికేస్తా
రోడ్డు ఆక్రమణను అడ్డుకున్న అధికారులను కత్తితో బెదిరించిన వ్యక్తి
హైదరాబాద్ – బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీ రోడ్డు నంబర్ 12లోని రోడ్డు ఆక్రమించి ప్రహారీ గోడ కట్టిన వ్యక్తిని అడ్డుకున్న టౌన్ ప్లానింగ్ అధికారులు
అడ్డుకున్న అధికారులను అడ్డంగా నరికేస్తా… pic.twitter.com/n1mzWsluJ2
— Telugu Scribe (@TeluguScribe) July 25, 2025