సిటీబ్యూరో, జూలై 25(నమస్తే తెలంగాణ): సైబర్ నేరగాళ్లు ఇప్పుడు కొత్త రూట్‌ను ఎంచుకున్నారు. కోడ్ భాషల్లో మెసేజ్‌లు పంపిస్తూ అమాయకులను నిలువునా ముంచేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సైబర్ క్రైమ్ పోలీసులు ప్రజలను హెచ్చరిస్తున్నారు. ప్రధానంగా గూగుల్ సెర్చ్ చేసిన తర్వాత వచ్చే ఫోన్ కాల్స్‌తో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. గతంలో గూగుల్ సెర్చ్ చేయగానే సైబర్ నేరగాళ్లు జోక్యం చేసుకొని బ్యాంక్ ఖాతా, డెబిట్, క్రెడిట్ కార్డువివరాలు, క్యూఆర్ కోడ్ స్కానింగ్ చేయించి అమాయకులను నిండా ముంచేవారు. తాజాగా సరికొత్త నేర ప్రక్రియను సైబర్ మోసగాళ్లు తెరపైకి తీసుకువచ్చారు. ఇప్పుడు గూగుల్ సెర్చ్ చేస్తున్న వారికి సైబర్ నేరగాళ్లు వల వేస్తున్నారు. గూగుల్ సెర్చ్ చేస్తున్న వారికి ఫోన్ చేసి.. “మీకు సురక్షితమైన కోడ్ లాంగ్వేజ్‌లో మెసేజ్ వస్తుంది.. ఆ మెసేజ్ క్లిక్ చేసి మీ వివరాలు వెల్లడిస్తే సరిపోతుంది”.. అంటూ సూచిస్తారు. వివరాలు నింపేలోపే మీ ఫోన్లో ఉండే ఫోన్- పే, జీ- పే ఇతర మనీ వాలెట్‌కు లింక్ ఉన్న ఖాతాల నుంచి నగదును ఖాళీ చేస్తున్నారు.
గూగుల్ సెర్చ్ వద్దు
ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు గూగుల్ సెర్చ్ అసలు చేయొద్దు. ఇప్పుడు వాటిలో అధికంగా సైబర్ క్రిమినల్స్ తిష్ట వేశారు. ఆయా సంస్థల అధికారిక వెబ్సైట్లలో సమాచారాన్ని తెలుసుకోవడం సురక్షితం. గూగుల్ సెర్చ్ చేసిన తర్వాత గుర్తు తెలియని వారి నుంచి వచ్చే ఫోన్ కాల్స్, మెసేజ్‌లలో వచ్చే లింక్‌లు, ఇతర అంశాల వైపు అసలు వెళ్లవద్దు. నేరగాళ్లు చెప్పినట్లు ఆర్థిక లావాదేవీలు చేయొద్దు. ప్రస్తుతం సైబర్ నేరగాళ్లు అమాయకులను నమ్మించడానికి కోడ్ లాంగ్వేజ్‌ను తలపించే మెసేజ్‌లను పంపించి నిండా ముంచుతున్నారు. తస్మాత్ జాగ్రత్త…
– శ్రీధర్, ఏసీపీ, సైబరాబాద్ సైబర్ క్రైం పీఎస్
కోడ్‌తో కూడిన మెసేజ్‌లు ఇలా…
PHOPNE-SMS-VERIFY-LOGIN
5763F24b8292e9cbb02be24d513af
b895218f46e1b38a326400738e542
2c35bd..
v Paytm Secure SMS to verify your number and Login…
ZDC4mtU2yMvimZa4ywvjmthIntC
5ndm20we30diZzjm=
ఇలాంటి గందరగోళాన్ని తలపించే కోడ్ భాషలో నేరగాళ్లు మెసేజ్‌లు పంపించి వాటిని క్లిక్ చేయిస్తున్నారు. అందులోని వివరాలను సేకరించి ఖాతాలను ఖాళీ చేస్తున్నట్లు సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసుల దర్యాప్తులో తేలింది.