కాబుల్: కునార్ నదిపై వీలైనంత త్వరగా ఆనకట్టలు నిర్మించి పాకిస్థాన్ ఆ నదీ జలాలను వినియోగించుకోకుండా నియంత్రించాలని అఫ్ఘానిస్థాన్ నిర్ణయించింది. ఈ మేరకు తాలిబన్ సుప్రీం లీడర్ మలాయి హిబతుల్లాహ్ అఖున్ద్జాదా ఆదేశించారని అఫ్ఘాన్ జల వనరుల శాఖ మంత్రి అబ్దుల్ లతీఫ్ మన్సూర్ ఎక్స్‌లో వెల్లడించారు.
తమ సొంత జలాలను నిర్వహించుకొనే హక్కు తాలిబ్లనకు ఉందని ఆయన తెలిపారు. పహల్గాం దాడి జరిగిన వెంటనే భారత్ సింధు జలాల ఒప్పందాన్ని సస్పెండ్ చేసిన విధంగానే తాము కునార్ నది జలాలను పాక్‌లోకి వెళ్లకుండా నియంత్రించాలని అఫ్ఘాన్ భావిస్తున్నది.