చెన్నై: తమిళనాడులో వచ్చే వారం నుంచి ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) ప్రారంభమవుతుందని కేంద్ర ఎన్నికల సంఘం మద్రాస్ హైకోర్ట్‌కు శుక్రవారం తెలిపింది. చెన్నైలోని టి.నగర్ నియోజకవర్గంలోని ఓటర్ల జాబితాలో భారీగా అవకతవకలు జరిగాయని మాజీ ఏఐఏడీఎంకే ఎమ్మెల్యే సత్యనారాయణ వేసిన పిటిషన్‌పై స్పందిస్తూ ఈసీ ఈ విషయాన్ని వెల్లడించింది.
పిటిషనర్ లేవనెత్తిన అంశాన్ని సర్‌లో పరిశీలిస్తామని కోర్టుకు తెలిపింది. ఈ నేపథ్యంలో బీహార్‌లో సర్ నిర్వహణకు సంబంధించిన సుప్రీం కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను తమకు సమర్పించాలని హైకోర్ట్ ఈసీని ఆదేశించింది. విచారణను వాయిదా వేసింది.