TSSPDCL | ముషీరాబాద్, అక్టోబర్ 24 : టిఎస్ఎస్పిడిసిఎల్ అజామాబాద్ డివిజన్ 11కెవి జామైఉస్మానియా, మూన్ కేఫ్, శివం, ఫీవర్ ఆసుపత్రి, సీసీ షరాఫ్, శివాలయం టెంపుల్ ఫీడర్ల పరిధిలో విద్యుత్ లైన్ల మరమ్మత్తుల కారణంగా శనివారం విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు అజామాబాద్ డివిజన్ ఏడీఈ జీ నాగేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు.
ఉదయం 10 గంటల నుంచి 1 గంటల వరకు
జామైఉస్మానియా, మూన్ కేఫ్, శివం, ఫీవర్ ఆసుపత్రి ఫీడర్ల పరిధిలోని జామైఉస్మానియా, ఎస్‌బిహెచ్ కాలనీ, అంబర్‌నగర్, లలితానగర్, అడిక్‌మెట్, రాంనగర్, అచ్చయ్యనగర్, మూన్కేఫ్, బృందావన్ కాలనీ, ప్రశాంత్‌నగర్, టీఆర్టీ క్వార్టర్స్, శివం టెంపుల్, నర్సింహ్మబస్తీ, తరుణీ సూపర్ మార్కెట్, విద్యానగర్ రైల్వే స్టేషన్, ఫీవర్ ఆసుపత్రి, అంజయ్య క్వార్టర్స్, తెలంగాణ యువతి మండలి, బర్కత్‌పుర పెట్రోల్ బంక్ పరిసరాల్లో కరెంట్ సరఫరా ఉండదు.
మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు
సీసీ షరాఫ్, శివాలయం టెంపుల్ ఫీడర్ల పరిధిలోని సీపీ షరాఫ్ ఆసుపత్రి, బుమన్నగల్లీ, రాజేంద్రనగర్ కాలనీ, లింగంపల్లి, కాచిగూడ రైల్వేస్టేషన్, శివాలయం, తాడి కౌంపౌండ్, సంజీవయ్యనగర్, బాలాజీ ఆర్కెడ్, కూరగాయల మార్కెట్ పరిసర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా ఉండదు.