సిటీబ్యూరో, జూలై 23 (నమస్తే తెలంగాణ) /వెంగళరావునగర్: పిల్లలకు పౌష్టికాహారం అందించడంలో రాజీ పడొద్దని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందన అన్నారు. అమీర్‌పేటలోని శిశువిహార్‌ను బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. శిశువిహార్‌లో దశల వారీగా విధులు నిర్వర్తించే అధికారులు బాధ్యతాయుతంగా ఉండాలని, పిల్లల ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యంగా ఉండొద్దని చెప్పారు. కార్యక్రమంలో జోనల్ కమిషనర్ హేమంత్, ఆర్జేడీ మోతి తదితరులు పాల్గొన్నారు.