Indigo Flight : ఈమధ్య వరుసగా విమానాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తున్న వేళ.. మరో ఇండిగో విమానా(Indigo Flight)నికి పెద్ద ప్రమాదం తప్పింది. అప్రమత్తమైన పైలట్లు హైదరాబాద్ వెళ్లాల్సిన ఫ్లయిట్‌ను అత్యవసరంగా ల్యాండింగ్ (Emergency Landing) చేశారు. మంగళవారం రాత్రి బెంగళూరు నుంచి ఇండిగో విమానం 200 మంది ప్రయాణికులతో హైదరాబాద్ బయల్దేరింది.
అయితే.. కొంచెం సేపటికే ప్రతికూల పరిస్థితులను గుర్తించారు పైలట్లు. దాంతో, సురక్షిత ప్రాంతంలో విమానాన్ని ల్యాండ్ చేయాలనుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని గన్నవరం విమానాశ్రయ సిబ్బందిని సంప్రదించి అత్యవసర ల్యాండింగ్ చేశారు పైలట్లు. దాంతో, అందులోని ప్రయాణికులు ‘హమ్మయ్య బతికిపోయాం’ అని ఊపిరిపీల్చుకున్నారు.