Vinesh Phogat : మాజీ రెజ్లర్, కాంగ్రెస్ ఎమ్మెల్యే వినేశ్ ఫొగాట్ (Vinesh Phogat) అభిమానులకు గుడ్‌న్యూస్. మంగళవారం ఉదయం 9 గంటల సమయంలో ఆమె పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. పురిటినొప్పులు రావడంతో ఢిల్లీలోని అపొలో ఆస్పత్రిలో చేరిన వినేశ్‌కు.. జూలై 1న కాన్పు చేశారు. తల్లీబిడ్డ సురక్షితంగా ఉన్నారని వైద్యులు వెల్లడించారు. తొలిసారి అమ్మానాన్న అయిన వినేశ్ దంపతులకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ కుమారి సెల్జా వినేశ్‌కు అభినందనలు తెలిపారు.
ఈ ఏడాది మార్చిలో వినేశ్, సోమ్విర్ రథీ తాము తల్లిదండ్రులం కాబోతున్నామనే విషయాన్ని వెల్లడించారు. ‘మా ప్రేమకథ మరో కొత్త అధ్యాయంతో కొనసాగనుంది’ అంటూ సోషల్ మీడియా పోస్ట్ ద్వారా ఫ్యాన్స్‌తో పంచుకున్నారు.
🚨#News | As per media reports, Vinesh Phogat has given birth to a baby boy.
Harvinder Phogat, Vinesh’s elder brother, was quoted by The Indian Express as saying that Vinesh had given birth to a baby boy on Tuesday morning at a private hospital in Delhi.
Both Vinesh and the… pic.twitter.com/QzKhgNEyPO
— The Bridge (@the_bridge_in) July 1, 2025
కామన్వెల్త్, ఆసియా క్రీడల ఛాంపియన్ అయిన వినేశ్ ఫొగాట్ 2018లో మల్లయోధుడు సోమ్‌వీర్‌ను పెళ్లి చేసుకుంది. నిరుడు పారిస్ ఒలింపిక్స్‌లో అదనపు బరువు కారణంగా అనర్హతకు గురైన వినేశ్.. రెజ్లింగ్‌కు వీడ్కోలు పలికింది. స్వదేశం వచ్చిన తర్వాత రాజకీయాల్లో చేరిన ఆమె కాంగ్రెస్ తరఫున అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచింది. జులానా నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన వినేశ్.. ప్రజా సేవలో తరిస్తోంది.