Harish Rao | రేవంత్‌కు జ్ఞానోదయం చేసింది బీఆర్ఎస్ పార్టీయే కదా.. సీఎంకు హరీశ్‌రావు కౌంటర్..!
Harish Rao | ఏపీ నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టు బనకచర్ల విషయంలో కాంగ్రెస్ సర్కారును మొద్దునిద్ర నుంచి లేపింది.. ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు తిరస్కరించే వరకు అలుపెరుగని పోరాటం చేసింది బీఆర్ఎస్ పార్టీయేనని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు.
Harish Rao | ఏపీ నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టు బనకచర్ల విషయంలో కాంగ్రెస్ సర్కారును మొద్దునిద్ర నుంచి లేపింది.. ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు తిరస్కరించే వరకు అలుపెరుగని పోరాటం చేసింది బీఆర్ఎస్ పార్టీయేనని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి ఘాటుగా స్పందించారు. గోదావరిలో వెయ్యి టీఎంసీలు, కృష్ణాలో 500 టీఎంసీలు చాలు అని చెప్పిన రేవంత్‌కు మిగులు జలాల్లోనూ తెలంగాణకు వాటా ఉంటుందని జ్ఞానోదయం చేసింది కూడా బీఆర్ఎస్ పార్టీయేనన్నారు. మళ్లీ అవే పాత అబద్ధాలు ప్రచారం చేస్తున్నాడని.. అపెక్స్ కౌన్సిల్ ఏర్పాటు చేయాలని ఇప్పటికీ ఎందుకు డిమాండ్ చేవని ప్రశ్నించారు. చంద్రబాబుపై నువ్వు చూపుతున్న గురు భక్తికి ఇది నిదర్శనం కాదా? అని ప్రశ్నించారు. గోదావరి వాటర్ డిస్ప్యూట్ బోర్డ్ (GWDT) అవార్డు ప్రకారం.. సీడబ్ల్యూ అనుమతి పొందకుండా ఈఏసీ అనుమతి ఇవ్వదన్నారు.
ఏపీ అనుమతుల కోసం సీడబ్ల్యూసీకి వెళ్లే కంటే ముందే అపెక్స్ కౌన్సిల్‌కు వెళ్లాలనే సోయి కూడా సీఎంకు లేదని విమర్శించారు. కనీస అవగాహన లేని వ్యక్తులు నీటి పారుదల శాఖ మంత్రిగా, ముఖ్యమంత్రిగా ఉండడం రాష్ట్రానికి పట్టిన దౌర్భాగ్యమన్నారు. తొమ్మిదిన్నరేండ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రస్తావనే రాని బనకచర్ల ప్రాజెక్టు.. ఇప్పుడు ఎవరి అండ చూసుకొని ముందుకు వచ్చిందో తెలంగాణ ప్రజలకు తెలియదా? అని ప్రశ్నించారు. మౌనంగా ఉంటూ అందిస్తున్న సహకారం వల్లనే కదా బనకచర్ల వ్యవహారం ఇక్కడి దాకా వచ్చింది రేవంత్ రెడ్డి అంటూ చురకలంటించారు. తెలంగాణ నీటి హక్కుల విషయంలో అన్యాయం చేస్తూనే.. లెక్కకు మించి అబద్దాలు ప్రచారం చేస్తూ.. బీఆర్ఎస్పై చేస్తున్న క్షుద్ర రాజకీయాన్ని తెలంగాణ సమాజం గమనిస్తుందని.. తెలంగాణ వ్యతిరేక విధానాలను అసహ్యించుకుంటున్నారన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్‌కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

