బడంగ్‌పేట: మీర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో కనిపించకుండాపోయిన బాలుడి ఆచూకీ ఇంకా లభించకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మీర్‌పేట దాసరి నారాయణ రావు కాలనీలో నివాసముండే మధుసూదన్‌రెడ్డి కవిత దంపతుల రెండో కుమారుడు మహేందర్‌రెడ్డి (13) ఓ ప్రైవేట్ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. ఆదివారం సాయంత్రం ట్యూషన్‌కు పోయి వస్తానని చెప్పి.. తిరిగి రాలేదు.
బాలుడి కోసం ఆరు బృందాలను రంగంలోకి దింపి గాలిస్తున్నట్లు సీఐ నాగరాజు తెలిపారు. నిందితుడు బాలుడిని ద్విచక్రవాహనంపై తీసుకెళ్తున్న దృశ్యాలు సీసీ ఫుటేజీలో నమోదయ్యాయని చెప్పారు. వాహనం నంబర్ ప్లేట్ గుర్తించకపోవడంతో వివిధ చోట్ల బాలుడు కోసం గాలిస్తున్నామన్నారు.