భార్యను కొట్టాననే మనస్థాపంతో భర్త ఆత్మహత్య
క్రైం న్యూస్ | భార్యను అకారణంగా కొట్టానని మనస్థాపానికి గురైన భర్త అత్యహత్యకు పాల్పడ్డ ఘటన నగరంలోని జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

హైదరాబాద్ : భార్యను అకారణంగా కొట్టానని మనస్థాపానికి గురైన భర్త అత్యహత్యకు పాల్పడ్డ ఘటన నగరంలోని జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..రహ్మత్‌నగర్ ఎస్పీఆర్ హిల్స్‌లోని రాజీవ్‌గాంధీ నగర్ బస్తీలో నివాసం ఉంటున్న ఎండీ.ఖదీర్(35) సోఫామేకర్గా పనిచేస్తుంటాడు.
సోమవారం రాత్రి 10.30 ప్రాంతంలో పీకలదాకా మద్యం సేవించి ఇంటికి వచ్చిన ఖదీర్‌తో భార్య సానియాబేగంతో గొడవ పడింది. రోజూ మద్యం సేవించి వస్తే ఎలా అంటూ ప్రశ్నించడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఖదీర్ అమెను కాపర్ వైర్‌తో చితకబాదాడు.
దాంతో ఆమెకు తీవ్రగాయాలయ్యాయి. అకారణంగా నిన్ను కొట్టానంటూ మనస్థాపానికి గురైన ఖదీర్ గ్యాస్ సిలిండర్‌లో రెగ్యులేటర్ ఇప్పి నిప్పంటించేందుకు యత్నించాడు. అడ్డుకున్న సానియా గ్యాస్ సిలిండర్‌ను తీసుకు వెళ్లి పక్కింట్లో పెట్టేందుకు వెళ్లింది.
ఈలోగా ఇంట్లో ఉన్న టర్పెంటాయిల్‌ను వంటిమీద పోసుకున్న ఖదీర్ నిప్పంటించుకున్నాడు. తీవ్రగాయాలవ్వగా స్థానికులు ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
దవాఖానలో చికిత్స పొందుతున్న ఖదీర్ మంగళవారం మద్యాహ్నం 12.30కి మృతి చెందాడు.
మృతుడి సోదరుడు మహ్మద్ అజీజ్ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇవి కూడా చదవండి..
శస్త్రచికిత్స వికటించి మహిళా సర్పంచ్ మృతి
బీన్స్‌తో డయాబెటిస్‌కు చెక్..!
కల్తీ కల్లుతో ఆరుగురికి అస్వస్థత
రైతులు ఇబ్బందులు పడొద్దనే కొనుగోలు కేంద్రాలు : మంత్రులు
పిల్లల్లో రోగ నిరోధక శక్తిని పెంచండిలా..!
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sandeep Reddy Vanga | రాప్తాడు ఘటనపై దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సంచలన ట్వీట్.. విషాదాన్ని అవకాశంగా మార్చుకోవద్దు!
Suspension | కామారెడ్డి మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం.. 14 మంది మెడికోలపై సస్పెన్షన్!
Jagtial Child | జగిత్యాల చిన్నారి ఘటనలో ట్విస్ట్.. హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధించాలని కలెక్టర్ పిటిషన్!
Prajwal | స్టార్ హీరోలు, నిర్మాతలనే ఆటపట్టించిన బుడ్డోడు .. ‘సమ్మర్ హాలిడేస్’ ఈవెంట్లో మరోసారి హైలైట్!
లైసెన్స్ లేకుండా బాణసంచా విక్రయిస్తే చర్యలు : గోదారి రవికుమార్
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

