హైదరాబాద్: హైదరాబాద్ పీవీ ఎక్స్ప్రెస్వే (PV Expressway) పై రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. మంగళవారం ఉదయం ఎక్స్ప్రెస్ వే పిల్లర్ నంబర్ 112 వద్ద వరుసగా మూడు కార్లు ఒకదానిని ఒకటి ఢీకొన్నాయి. దీంతో పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు.
ప్రమాదానికి గురైన కార్లు రోడ్డుకు అడ్డంగా పడిపోవడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో కార్లను తొలగించి వాహనాలను క్లియర్ చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉన్నది.