సందర్శకులతో కిటకిటలాడిన ఎగ్జిబిషన్
నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో జరుగుతున్న నుమాయిష్‌లో ఆదివారం సందడి నెలకొన్నది. కరోనా కారణంగా ఎగ్జిబిషన్‌కు స్వల్ప విరామం అనంతరం ప్రారంభించారు. కరోనా తగ్గుముఖం పట్టడంతో నగరం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున్న ప్రజలు తరలివచ్చారు. మహిళలు తమకు నచ్చిన షాపింగ్ చేయగా, చిన్నారులు ఆటల్లో మునిగిపోయారు. వివిధ రాష్ర్టాల నుంచి వచ్చిన వస్ర్తాలు, ఆహార పదార్థాలు, ఇతర ఉత్పత్తులు నగరవాసులను మంత్రముగ్ధులను చేశాయనడంలో ఆశ్చర్యం లేదు.