హైదరాబాద్: జీహెచ్ఎంసీలో (GHMC) తెల్లవారుజాము నుంచి కుండపోతగా వర్షం కురుస్తున్నది. హైదరాబాద్ నగర వ్యాప్తంగా మరో మూడు గంటల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే (Heavy Rains) అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్నగర్ జిల్లాల్లో స్కూళ్లకు ప్రభుత్వం సెలవు (Holiday) ప్రకటించింది. భారీ వర్షాల కారణంగా ముందు జాగ్రత్తగా విద్యాసంస్థలకు సెలవు ప్రకటించినట్లు ఆయా జిల్లాల కలెక్టర్లు (Collectors) తెలిపారు.