సమర్కండ్ : చెస్ ఒలింపియాడ్‌లో భారత జట్లు తొలి డ్రా ఎదుర్కొన్నాయి. గురువారం జరిగిన ఎనిమిదో రౌండ్లో పురుషుల, మహిళల జట్ల మ్యాచ్‌లు డ్రా అయ్యాయి. ఓపెన్ సెక్షన్లో అబ్బాయిలు 2-2తో అజర్‌బైజాన్‌తో సమంగా నిలిచారు.
అర్జున్, ప్రజ్ఞానంద, గుకేశ్, విదిత్ నలుగురి గేమ్స్ డ్రాగా ముగిశాయి. అమ్మాయిల జట్టుకు యువ క్రీడాకారిణి సవిత శ్రీ ఓటమి తప్పించింది. నాలుగో బోర్డులో ఆడిన సవిత.. ఎల్నాజ్కు చెక్ పెట్టడంతో కజకిస్థాన్‌తో మ్యాచ్‌ను డ్రా చేసుకున్నారు. ఈ టోర్నీలో సవితకు ఇది ఏడో విజయం కావడం విశేషం.