హోర్డింగ్‌లతో భయం..భయం
గ్రేటర్ హైదరాబాద్‌లో హోర్డింగ్‌లు భయపెడుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే విచ్చలవిడిగా గ్రేటర్ వ్యాప్తంగా అనుమతి లేని హోర్డింగ్‌లు కోకొల్లలుగా పుట్టుకొచ్చాయి. ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతూ ప్రైవేట్ యాడ్ ఏజెన్సీలు అక్రమ దందాకు తెరలేపారు.
- గ్రేటర్ వ్యాప్తంగా విచ్చలవిడిగా ఏర్పాటు
- తాజ్‌కృష్ణా వద్ద రోడ్డుపైకి వేలాడుతున్న ఫ్లెక్సీ
- భయాందోళనలో ద్విచక్ర వాహనదారులు
సిటీబ్యూరో, జూలై 4 (నమస్తే తెలంగాణ ) : గ్రేటర్ హైదరాబాద్‌లో హోర్డింగ్‌లు భయపెడుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే విచ్చలవిడిగా గ్రేటర్ వ్యాప్తంగా అనుమతి లేని హోర్డింగ్‌లు కోకొల్లలుగా పుట్టుకొచ్చాయి. ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతూ ప్రైవేట్ యాడ్ ఏజెన్సీలు అక్రమ దందాకు తెరలేపారు. ప్రకటనల పాలసీ తీసుకువచ్చామని చెబుతున్న సర్కారు..క్షేత్రస్థాయిలో ఎక్కడ అమలు కావడం లేదు.దీని ఫలితంగానే ఎల్లప్పుడూ వాహనాల రద్దీతో ఉండే బంజారాహిల్స్ తాజ్‌కృష్ణ మార్గంలో హోర్డింగ్ వాహనదారులకు భయపెడుతున్నది.
బంజారాహిల్స్ పరిధిలోని తాజ్ డెకన్ – తాజ్ కృష్ణ హోటళ్ల మధ్య ఉన్న బ్రిడ్జిపై ఏర్పాటు చేసిన ఒక భారీ హోర్డింగ్ ఫ్లెక్సీ ప్రమాదకరంగా మారింది. గడిచిన కొన్ని రోజులుగా వీస్తున్న బలమైన గాలుల ధాటికి ఈ భారీ ఫ్లెక్సీ పూర్తిగా చినిగిపోయింది. చిరిగిన ఫ్లెక్సీ ముకలు రోడ్డుపైకి ప్రమాదకరంగా వేలాడుతుండటంతో, ఆ మార్గంలో ప్రయాణించే వాహనదారులకు, ముఖ్యంగా ద్విచక్ర వాహనదారుల ముఖాలకు, తలలకు తాకుతున్నాయి. దీంతో వాహనాల నియంత్రణ కోల్పోయి కిందపడిపోయే ప్రమాదం పొంచి ఉంది.
ప్రాణాలకే ప్రమాదం..
ఈ వంతెన కింద ఎల్లప్పుడూ వాహనాల రద్దీ ఎకువగా ఉంటుంది. ఎప్పుడు ఏ క్షణంలో ఆ భారీ ఫ్లెక్సీ ఊడి కిందపడుతుందో, ఎవరి ప్రాణాలు తీస్తుందోనని స్థానికులు, ప్రయాణికులు తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. రాత్రి వేళల్లో ప్రయాణించే వారికి ఈ వేలాడుతున్న ఫ్లెక్సీలు సరిగ్గా కనిపించకపోవడంతో ప్రమాద తీవ్రత మరింత ఎకువగా ఉండే అవకాశం ఉంది. వేగంగా వెళ్లేటప్పుడు ఆ ఫ్లెక్సీ ముకలు ఒకసారిగా బైక్‌లకు చుట్టుకుంటే ప్రాణాలకే ప్రమాదం ఉందని, అధికారులు వెంటనే స్పందించాలని వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు.
జీహెచ్ఎంసీ సరిల్ అధికారులు, విజిలెన్స్ విభాగానికి సమాచారం అందించినా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని మండిపడుతున్నారు. పెద్ద ప్రమాదం జరిగి ప్రాణనష్టం సంభవించక ముందే, ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి ఆ ప్రమాదకర ఫ్లెక్సీని తొలగించాలని, నిబంధనలు ఉల్లంఘించిన హోర్డింగ్ నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున క్లాస్.. రోహిత్, అమన్‌లకు షాక్.. వచ్చే వారం కెప్టెన్సీకి నో!
Dasara Safety Tips | దసరాకు ఊరెళ్తున్నారా జాగ్రత్త..! గ్రేటర్లో దొంగల కలకలం
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

