HMWSSB | హైదరాబాద్ : తాగునీటితో వాహనాలను శుభ్రం చేసిన ఓ వ్యక్తి పట్ల జలమండలి సీరియస్గా స్పందించింది. అతనికి రూ. 10 వేల జరిమానాను విధించింది జలమండలి.
బుధవారం రోజు బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లో ఓ వ్యక్తి తన ఇంటి ముందు కారు, ద్విచక్ర వాహనాన్ని నీటితో శుభ్రం చేశాడు. అదే సమయంలో అదే మార్గంలో జలమండలి ఎండీ అశోక్ రెడ్డి వెళ్లారు. ఈ ఘటనను గమనించిన ఎండీ అశోక్ రెడ్డి విచారణకు ఆదేశించారు. జలమండలి సరఫరా చేసే తాగునీటితో ఆ వ్యక్తి కారును, బైక్ను శుభ్రం చేసినట్లు విచారణలో తేలింది. దీంతో సదరు వ్యక్తికి జలమండలి రూ. 10 వేల జరిమానా విధించింది.