హైదరాబాద్: నగరంలో అక్రమ నిర్మాణాలపై ప్రభుత్వం కన్నెర్ర చేసింది. దీంతో హైదరాబాద్‌లో పలుచోట్ల అక్రమ కట్టడాలను అధికారులు కూల్చివేస్తున్న సంగతి తెలిసిందే. అనధికార భవనాలు, అక్రమ నిర్మాణాలను హెచ్ఎండీఏ కూల్చివేస్తోంది.
శంషాబాద్ పరిధిలో పలుచోట్ల నిర్మించిన అక్రమ కట్టడాలను కూడా కూల్చివేస్తున్నారు. పోలీసు బందోబస్తు మధ్య ఈ కూల్చివేతలను చేపట్టారు. మణికొండ మున్సిపాలిటీ పరిధిలో కూడా అక్రమ కట్టడాలను పడగొడుతున్నారు.
అయితే తమ భవనాలు కూల్చివేయడాన్ని యజమానులు అడ్డుకుంటున్నారు. పెద్దఅంబర్‌పేటలో కూడా అక్రమ నిర్మాణాల కూల్చివేత కొనసాగుతోంది.