న్యూఢిల్లీ : కాక్రోచ్ జనతా పార్టీ ఇక నుంచి ఎన్నికల సంఘంపై ప్రధానంగా దృష్టి సారిస్తుందని అభిజీత్ దీప్కే పేర్కొన్నారు. పేపర్ లీకులపై పోరాడినా, స్కూల్ ఠీక్ కరో ఉద్యమాన్ని నడిపిస్తున్నా.. చివరకు ఓటు హక్కు మాత్రమే వీటిని నిలబెట్టగలదన్నారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌పై ఎన్నికల సంఘంలోనే ఇద్దరు కమిషనర్ల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావడంతో దీప్కే ఎక్స్‌లో ట్వీట్ చేస్తూ.. ‘ఎలక్షన్ కమిషన్‌ను సరిచేయండి. రేపు ఢిల్లీలో ప్రెస్కాన్ఫరెన్స్. జ్ఞానేశ్ పని అయిపోయింది బ్రో’ అంటూ రాసుకొచ్చారు. గురువారం సీజేపీ కార్యక్రమాలను రద్దు చేసుకుని ప్రజాస్వామ్యాన్ని హైజాక్ చేయడం అనే అంశంతో ఈ ప్రెస్కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు.