ఢిల్లీ : మూడేండ్ల తర్వాత భారత్లో నిర్వహించనున్న ఐపీఎల్ వేలానికి గోవా వేదిక కానుంది. డిసెంబర్ 15, 16న వేలాన్ని గోవాలో నిర్వహించేందుకు సన్నాహకాలు చేస్తున్నట్టు లీగ్ చైర్మన్ అరుణ్ ధుమాల్ తెలిపారు.
గత మూడు ఎడిషన్లలో వేలాన్ని దుబాయ్, జెడ్డా, అబుదాబిలో నిర్వహించిన విషయం విదితమే.