హైదరాబాద్, ఆట ప్రతినిధి : వరల్డ్ పవర్‌లిఫ్టింగ్ కాంగ్రెస్ (డబ్ల్యూపీసీ) నేషనల్ డెడ్‌లిఫ్ట్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ పవర్‌లిఫ్టర్ శ్యామ్ సుందర్ రెండు పతకాలతో సత్తాచాటాడు.
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం గగన్‌పహాడ్‌కు చెందిన 26 ఏండ్ల శ్యామ్.. నోయిడాలో జరిగిన పురుషుల 67.5 కిలోల ఓపెన్ కేటగిరీలో 202.5 కిలోల బరువులెత్తి రజతం సాధించాడు. అంతేగాక డబ్ల్యూపీఎస్వో నేషనల్ చాంపియన్‌షిప్‌లో పోటీపడుతూ ఎక్స్ట్రీమ్ కర్ల్స్ కేటగిరీలో అంతే బరువును ఎత్తి స్వర్ణాన్ని కైవసం చేసుకున్నాడు.