e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, August 1, 2021
Home హైదరాబాద్‌ జీహెచ్‌ఎంసీ పరిధిలో పీక్‌ అవర్‌ డిమాండ్‌గా రికార్డు

జీహెచ్‌ఎంసీ పరిధిలో పీక్‌ అవర్‌ డిమాండ్‌గా రికార్డు

జీహెచ్‌ఎంసీ పరిధిలో పీక్‌ అవర్‌ డిమాండ్‌గా రికార్డు

విద్యుత్‌ డిమాండ్‌ క్రమంగా పెరుగుతోందని, గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో అత్యధిక డిమాండ్‌గా బుధవారం 2760 మెగావాట్లు నమోదైందని తెలంగాణ రాష్ట్ర దక్షిణ ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ సీఎండీ రఘుమారెడ్డి తెలిపారు. రానున్న వేసవిలో కాలంలో అది 3000 మెగావాట్ల డిమాండ్‌ వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నామన్నారు. అందుకనుగుణంగా సరఫరా చేసేందుకు తమ యంత్రాంగం సిద్ధంగా ఉందని తెలిపారు. గ్రేటర్‌ పరిధిలో ఉన్న ఐటీ పరిశ్రమలకు విద్యుత్‌ సరఫరా చేసేందుకు ప్రత్యేకంగా లైన్లను ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. ముఖ్యంగా టీఎస్‌ ఐపాస్‌తో హైదరాబాద్‌ నగరంలో పరిశ్రమలు నెలకొల్పుతున్నారని, దీంతో విద్యుత్‌ వినియోగం గణనీయంగా పెరుగుతుందన్నారు.

అదేవిధంగా అమెజాన్‌ మూడు చోట్ల ఏర్పాటు చేస్తున్న డేటా సెంటర్లకు కలిపి 30 మెగావాట్ల చొప్పున విద్యుత్‌ సరఫరా చేస్తున్నామని తెలిపారు. భవిష్యత్తులోనూ ఎలాంటి సాంకేతిక పరమైన సమస్యలు తలెత్తకుండా, మాల్‌వేర్‌ల పట్ల అప్రమత్తంగా ఉంటూ, కేంద్ర ప్రభుత్వ సైబర్‌ నిపుణులతో ఎప్పటికప్పుడు విద్యుత్‌ ఇంజినీర్లు, సాంకేతిక నిపుణులు సంప్రదింపులు చేస్తున్నారని చెప్పారు. సీఎం కేసీఆర్‌ ముందుచూపుతో తీసుకున్న నిర్ణయంతో ఎంత విద్యుత్‌ డిమాండ్‌ ఉన్నా సరఫరా చేసే నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకోవడంతోనే ఇది సాధ్యమైందని రఘుమారెడ్డి వివరించారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
జీహెచ్‌ఎంసీ పరిధిలో పీక్‌ అవర్‌ డిమాండ్‌గా రికార్డు
జీహెచ్‌ఎంసీ పరిధిలో పీక్‌ అవర్‌ డిమాండ్‌గా రికార్డు
జీహెచ్‌ఎంసీ పరిధిలో పీక్‌ అవర్‌ డిమాండ్‌గా రికార్డు

ట్రెండింగ్‌

Advertisement