హైదరాబాద్, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ) : శేరిలింగంపల్లి పెద్దాపూర్‌లోని వేల కోట్ల రూపాయల విలువైన 57 ఎకరాలు ప్రభుత్వ భూమేనని హైకోర్టు తీర్పు చెప్పింది. కొండాపూర్ సర్వే నెం.50 లోని 57.09 ఎకరాలు సర్కార్‌దేనని తేల్చింది. ఈ భూముల్ని కాజేసేందుకు ప్రైవేట్ వ్యక్తులు చేసిన ప్రయత్నాలు హైకోర్టులో వీగిపోయాయి. ఈ భూములను దక్కించుకునేందుకు కబ్జాదారులు గట్టి ప్రయత్నాలు చేశారని గుర్తించింది.
ఈ భూములు ప్రైవేట్ వ్యక్తులవేనని, ఒకొకరికి మూడు ఎకరాల చొప్పున మ్యుటేషన్ చేయాలని పేరొంటూ సివిల్ కోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేసింది. కోర్టు తీర్పును రద్దు చేయాలని 2002లో ప్రభుత్వం హైకోర్టులో అప్పీళ్లను దాఖలు చేయగా వాటిని అనుమతిస్తు జస్టిస్ నగేశ్ భీమపాక ఇటీవల తీర్పు చెప్పారు. 1961 డిసెంబరు 13 న తహసీల్దారు లావణి నిబంధనల కింద తాతాలిక పట్టా మం జూరు చేశారన్న ప్రైవేటు వ్యక్తులు చెబుతున్నారు. అయితే, లావణి నిబంధనల్లో జీ-పట్టా ఫా రంతో వాళ్ల పట్టాకు పొంతన లేదు. రూల్స్‌లో తాతాలిక పట్టా అనేది లేదు.
1961 డిసెంబరు 13న తహసీల్దారు పట్టా ఇచ్చినట్లు చెబుతున్న వాటిపై సంతకం డిసెంబరు 21 తేదీన చేసినట్లుంది. ఇలాంటి అనుమానాలను పిటిషనర్లు నివృత్తి చేయలేకపోయారు. ముందుగా పట్టాలు రెడీ చేశారని, తర్వాత తహసీల్దార్ సంతకం చేశారని సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పు చట్ట వ్యతిరేకం. భూమి హకులను నిరూపించుకునేది భూమి తమదని చెప్పే వారిపైనే ఉంటుందని సుప్రీం కోర్టు తీర్పులున్నాయి.ఇలా చేయడంలో పిటిషనర్లు విఫలమయ్యారు. కొత్త అసైన్మెంట్ పాలసీ వచ్చాక లావణి నిబంధనల కింద పట్టా ఎలా పొందారో పిటిషనర్లు నిరూపించుకోలేకపోయారు.
ఇం దులో తమ భూమి 38 ఎకరాల కొనుగోలుకు ఒప్పం దం చేసుకున్నామంటూ కాసాని జ్ఞానేశ్వర్ కుటుంబసభ్యులు, మరో రెండు సంస్థలు వేసిన ఇంప్లీడ్ పిటిషన్లను కూడా కొట్టివేసింది. కొండాపూర్ భూములను ప్రభు త్వం ఆర్టీసీ, ఆర్టీయే, చండ్ర రాజేశ్వర్ రావు ఫౌండేషన్, జీర్ ఎడ్యుకేషన్ ట్రస్ట్, శ్మశానం, పేదల ఇండ్ల కోసం సుమారు 39 ఎకరాలను కేటాయించగా, ఇక మిగిలిన ప్రభుత్వ భూమి 10.19 ఎకరాలేనని ప్రభుత్వం వాదించింది.