Congress vs MIM | హైదరాబాద్ : నాంపల్లి నియోజకవర్గం పరిధిలో కాంగ్రెస్, ఎంఐఎం కార్యకర్తల మధ్య దాడులు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నాంపల్లి నియోజకవర్గాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. నియోజకవర్గం పరిధిలోని సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు భారీగా మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. అయితే మెహిదీపట్నం నుంచి మల్లేపల్లి వైపు వాహనాలకు అనుమతించడం లేదు. ఈ క్రమంలో మల్లేపల్లి – మెహిదీపట్నం మధ్య రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి.
నాంపల్లి నియోజకవర్గంలో రహదారి పనులు కొనసాగుతున్నాయి. ఆ రహదారి పనులు చేస్తుండగా ఓ వృద్ధుడు గుంతలో పడిపోయాడు. బాధితుడికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో రహదారిపై గుంతలు, తనకు తగిలిన గాయంపై కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్‌కు వృద్ధుడు చెప్పాడు. దీంతో ఫిరోజ్ ఖాన్ రహదారి పనులను పరిశీలించేందుకు వెళ్లాడు. విషయం తెలుసుకున్న ఎంఐఎం ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్‌తో పాటు ఆయన వర్గీయుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఇరు వర్గాల మధ్య పరస్పరం రాళ్ల దాడి జరిగింది. పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు.
ఇవి కూడా చదవండి..
KTR | పనిమంతుడని పందిరేపిస్తే.. పిల్లి తోక తగిలి కూలిందట.. రేవంత్‌పై కేటీఆర్ తీవ్ర విమర్శలు
Obscene videos | సోషల్ మీడియాలో అసభ్యకర వీడియోలు.. అసిస్టెంట్ డైరెక్టర్ పై కేసు నమోదు
Accident | సంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి