Heavy Rains | హైదరాబాద్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో వర్షం కురుస్తోంది. నేటి మధ్యాహ్నం వరకు ఉక్కపోతతకు ఉక్కిరిబిక్కిరి అయిన హైదరాబాద్ నగరంలో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. రెండు గంటల పాటు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కాబట్టి నగర ప్రజలు ఎవరూ బయటకు రావొద్దని జీహెచ్ఎంసీ హెచ్చరించింది.
మేడ్చల్, సిద్దిపేట, మెదక్, వికారాబాద్, కామారెడ్డి, సిరిసిల్ల నుంచి హైదరాబాద్ వైపు వర్షం వ్యాపించింది. రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కూకట్పల్లి, మియాపూర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, సోమాజిగూడ, ఖైరతాబాద్, సికింద్రాబాద్, తార్నాక, ఉప్పల్, రాంనగర్, కోఠి, బేగంబజార్, మెహిదీపట్నం, మాసబ్‌ట్యాంక్, హైటెక్‌సిటీ, ఎల్బీనగర్, దిల్సుఖ్నగర్ ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది.