సిటీబ్యూరో: నగరంలో మంగళవారం సాయం త్రం కురిసిన చిన్నపాటి వర్షానికే సిటీ ఆగమాగమైంది. రహదారులపై ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అలాగే పలు చోట్ల కరెంటుపోయి అంధకారం అలుముకున్నది. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. కుతుబ్షాషీ టూంబ్స్ దగ్గర డైమండ్హిల్స్ కాలనీలో ఓ చెట్టు నేలకూలి విద్యుత్ వైర్లపై పడడంతో ఆ ప్రాంతంలో సరఫరా నిలిచిపోయింది.
గచ్చిబౌలి తదితర ప్రాంతాల్లో సాయంత్రం ఐదు గంటల నుంచి సుమారు రెండు నుంచి మూడు గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీనిపై స్థానికులు ఫ్యూజ్ ఆప్ కాల్కు ఫిర్యాదు చేసే ప్రయత్నం చేసినా స్పందన లేదని, అంతేకాకుండా స్థానిక విద్యుత్ సిబ్బందిని సంప్రదించే ప్రయత్నం చేస్తే వారు వర్షం పడుతున్నందున మొత్తం కరెంట్ పోయిందని చెప్పినట్లు తెలిపారు.