హైదరాబాద్: హైదరాబాద్లోవాన (Rain) దంచికొట్టింది. సోమవారం ఉదయం నగరంలోని పలుచోట్ల కుండపోతగా వర్షం కురిసింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, అమీర్‌పేట, ఎర్రమంజిల్, కూకట్పల్లి, ఖైరతాబాద్, లక్డీకపూల్, మాదాపూర్, బాలానగర్, మెహదీపట్నం, టోలిచౌకి, యూసఫ్‌గూడ, మాసాబ్‌ట్యాంక్, సికింద్రాబాద్, ఉప్పల్ సహా పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఉదయం 6.40 గంటలకు ప్రారంభమైన వాన సుమారు గంటపాటు ఏకధాటిగా కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు ప్రాంతాల్లో రోడ్లపై వర్షం నీరు నిలిచిపోయింది. పంజాగుట్ట స్మశాన వాటిక సమీపంలో రోడ్డుపైకి మోకాళ్ల లోతు నీరు రావడంతో ట్రాఫిక్ జామ్ అయింది. పంజాగుట్ట ఫ్లైఓవర్ నుంచి సుమారు కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో జీహెచ్ఎంసీ సిబ్బంది, పోలీసులు డ్రైనేజీ మ్యాన్‌హోల్స్ తెరిచి వరద నీరు పోయేలా చర్యలు తీసుకున్నారు.
హైదరాబాద్‌లో ఆగస్టు 15 వరకు నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది. గురువారం వరకు నగరంలో వానలు పడతాయని, ప్రధానంగా వాతావరణం మేఘావృతమై ఉంటుందని పేర్కొంది. అదేవిధంగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. మరో రెండ్రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని చెప్పారు. నేడు పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, మహబూబాబాద్, జనగాం, హనుమకొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు వాతావరణశాఖ అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. భారీ వర్షానికి తోడు ఈదురు గాలులు కూడా వీస్తాయని చెప్పారు. గంటకు 30-40 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నట్లు చెప్పారు.
Today at bowenpally pic.twitter.com/o1d93Pg65e
— Raj (@Richard_lazy) August 13, 2024
@balaji25_t Heavy sudden rain Secunderabad pic.twitter.com/yLJmEtxuEJ
— Arun Iyengar (@aruniyengartwo) August 13, 2024