Rain | శంషాబాద్ రూరల్, మే 29 : శంషాబాద్ పట్టణంలో గురువారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. దీంతో పట్టణంలోని రోడ్లన్ని జలమయంగా మారాయి. ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వర్షకాలం ప్రారంభంలోనే రుతుపవనాల రాకతో వర్షాలు కురుస్తున్నాయి. గత రెండు రోజుల నుంచి శంషాబాద్ మున్సిపాలిటీతో పాటు మండలంలోని వివిధ గ్రామాలలో వర్షాలు కురియడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రోహిణి కార్తెతో వర్షం కురిస్తే వ్యవసాయ పంటలు సాగు చేయడానికి మంచి అవకాశమని పలువురు రైతులు వివరిస్తున్నారు. వర్షాలు సంపూర్ణంగా కురిస్తే వ్యవసాయానికి ఇబ్బందులు లేకుండా ఉంటుందని పలువురు రైతులు తెలిపారు.