22ఏ నిషేధిత జాబితా ఎత్తేసేవరకు బాధితులకు అండగా ఉంటామని, ఢిల్లీ తరహాలో పోరాడి అసెంబ్లీ, సచివాలయాన్ని ముట్టడిస్తామని, బీఆర్ఎస్కు పోరాటాలు కొత్తకాదని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. రానున్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పోరాడుతుందని, 22ఏ, హౌసింగ్ బోర్డు ఆస్తుల అమ్మకాలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. ప్రభుత్వం వెంటనే నిషేధిత జాబితా(22ఏ)ను తొలగించాలని డిమాండ్ చేశారు. కేపీహెచ్‌బీ కాలనీ ఎన్ఆర్ఎస్ఏ కమ్యూనిటీ హాల్లో స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన 22ఏ నిషేధిత భూముల బాధిత కుటుంబాల ఆవేదన సదస్సులో మాజీ మంత్రి హరీశ్‌రావు పాల్గొని మాట్లాడారు.
22ఏ పేరిట కాంగ్రెస్ సర్కార్ కమీషన్ల దందాకు తెరలేపిందని ధ్వజమెత్తారు. బాధితులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. భూములే కేంద్రంగా రేవంత్ రెడ్డి పాలన సాగుతున్నదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ తుగ్లక్ నిర్ణయాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. 30, 40 ఏండ్లుగా నివాసముంటున్న సామాన్యుల ఆస్తులను రాత్రికి రాత్రే 22ఏ నిషేధిత జాబితాలో చేర్చి కాంగ్రెస్ సర్కార్ వేధింపులకు గురి చేస్తున్నదని మండిపడ్డారు. ‘హైదరాబాద్‌లో ఎవరైనా గుండె మీద చేయి వేసుకొని హాయిగా నిద్రపోయే పరిస్థితి ఉందా? ఎప్పుడు తమ ఆస్తులను 22ఏలో పెడతారో, ఎప్పుడు హైడ్రా బుల్డోజర్లు వస్తాయోనని ప్రజలు బికుబికుమంటూ బతుకుతున్నార’ని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు.

కూకట్పల్లి నియోజవర్గంలో నిజాయతీగా కొనుగోలు చేసిన భూములను 22ఏ నిషేధిత స్థలాలుగా గుర్తించడం బాధాకరం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకా కేపీహెచ్‌బీ కాలనీలో ప్రజా అవసరాల కోసం వదిలిన స్థలాలు, గజాల స్థలాలను కూడా అమ్ముకుంటున్నారు. ఇప్పటికే 2వేల కోట్ల విలువైన స్థలాలను విక్రయించారు. మిగిలినవి కూడా అమ్ముకునేందుకు సిద్ధమయ్యారు. కూకట్పల్లి మండలంలో 50 ఏండ్ల కిందట వెలసిన వసంతనగర్, సర్దార్‌పటేల్ నగర్, సీబీసీఐడీ కాలనీ, ఎన్ఆర్ఎస్ఏ కాలనీ, ధర్మారెడ్డి కాలనీ ఫేజ్-2, ఎస్ఎస్ కాలనీ, డ్రీమ్వ్యూ కాలనీలను 22ఏలో చేర్చారు. రెండేండ్ల కాలంగా నిషేధిత జాబితాలో పెట్టారు. దీనిపై అనేక సార్లు కలెక్టర్‌కు, సీఎంకు, రెవెన్యూశాఖ అధికారులకు ఫిర్యాదులు చేశాం. ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరం.
కూకట్పల్లి మండలంలో 50 సంవత్సరాల క్రితం వెలిసిన వసంతనగర్, సర్ద్ధార్పటేల్ నగర్, సీబీసీఐడీ కాలనీ, ఎన్ఆర్ఎస్ఏ కాలనీ, ధర్మారెడ్డి కాలనీ ఫేజ్-2, ఎస్ఎస్ కాలనీ, డ్రీమ్వ్యూ కాలనీలను 22ఏ లో చేర్చడం బాధాకరమన్నారు. దీనిపై పలుమార్లు కలెక్టర్, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదన్నారు. రాజకీయంగా నన్ను ఎదుర్కోలేక కూకట్‌పల్లిని మూడు ముక్కలు చేశారని మాధవరం మండిపడ్డారు. హైడ్రా, 22ఏ పేరుతో ప్రజలను ఇబ్బంది పెట్టడం మానుకోవాలని హితవు పలికారు.
కేపీహెచ్‌బీ కాలనీ, ఆగస్టు 26: తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో ప్రజలే కేంద్రంగా పాలన సాగిందని, సీఎం రేవంత్‌రెడ్డి పాలనలో భూములే కేంద్రంగా పాలన సాగుతోందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శించారు. బుధవారం కూకట్‌పల్లిలో 22ఏ, హౌసింగ్ భూముల అమ్మకానికి నిరసనగా ఏర్పాటుచేసిన సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, లోక్‌సత్తా పార్టీ అధినేత జయప్రకాష్ నారాయణతో కలిసి హరీశ్‌రావు హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పాలనలో నగరంలో తాగునీటి, కరెంట్, ట్రాఫిక్ సమస్యలు, పేదల కష్టాలను తీర్చేందుకు పనిచేశామని.. నేడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వ భూములను అమ్ముకోవడం, ప్రజల భూములను నిషేధిత జాబితాలో చేర్చి దందాలు చేయడంపైనే దృష్టి కేంద్రీకరిస్తోందని విమర్శించారు. ప్రభుత్వ ఆస్తులకు తన సోదరులకు కట్టబెట్టడం, ప్రైవేట్ ఆస్తులకు 22ఏలో పెట్టి బెదిరింపులకు పాల్పడుతున్నాడన్నారు. దీంతో కొంతమంది బ్రోకర్లు 30 శాతం కమీషన్లతో 22ఏ క్లియర్ చేస్తామని దందాలు చేస్తున్నారని, ఇది ప్రభుత్వ వైఫల్యమేనన్నారు. బీఆర్ఎస్కు పోరాటాలు కొత్త కాదని, 22ఏ తొలగించే వరకు మీకు అండగా ఉంటామని, ఢిల్లీ తరహాలో పోరాడి అసెంబ్లీ, సెక్రటేరియట్లను ముట్టడిస్తామని హెచ్చరించారు.
కూకట్పల్లి నియోజవర్గంలో నిజాయితీగా కొనుగోలు చేసిన భూములపై 22ఏ నిషేధిత భూములుగా గుర్తించడం బాధాకరమని, 22ఏ ను ఎత్తివేసేవరకు కాంగ్రెస్ నేతలను వదిలే ప్రసక్తి లేదని స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు హెచ్చరించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం, మాజీ సీఎం కేసీఆర్ పాలనలో కూకట్పల్లి నియోజకవర్గంలో 50 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడి పార్కులుగా అభివృద్ధి చేశామన్నారు. గతంలో నెక్సెస్ మాల్ పక్కన స్థలం విషయంలో…హౌసింగ్‌బోర్డు హైకోర్టులో ఓడిపోతే సుప్రీంకోర్టుకు వెళ్లి 11 ఎకరాల స్థలాన్ని కాపాడమని, ఆ భూమిలోనే ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి ఇందిరమ్మ టవర్స్‌కు శంకుస్థాపన చేశారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కేపీహెచ్‌బీ కాలనీలో ప్రజా అవసరాల కోసం వదిలిన స్థలాలను అమ్ముకుంటోందని, ఇప్పటికే రూ.2వేల కోట్ల విలువైన స్థలాలను అమ్ముకున్నారని, మిగిలినవి కూడా అమ్ముకునేందకు సిద్ధమయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రజలు కషార్జితంతో చట్టబద్ధంగా కొనుగోలు చేసిన ఆస్తులకు రక్షణ లేకుంటే.. ప్రభుత్వం స్పందిచకుండా పాలన సాగిస్తే.. ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రజలకు నమ్మకం పోతుందని లోక్‌సత్తా పార్టీ అధినేత, మాజీ ఎమ్మెల్యే జయప్రకాష్‌నారాయణ అన్నారు. కూకట్పల్లి మండలంలో 22ఏ జాబితాలో పెట్టిన కాలనీల సమస్యలను అధ్యయనం చేసిన తర్వాత సీఎం, రెవెన్యూమంత్రికి, సీసీఎల్ఏకు ఫిర్యాదు చేశామని.. అయితే వారినుంచి ఎలాంటి స్పందన రాలేదన్నారు. కార్యక్రమంలో మల్కాజిగిరి ఇన్చార్జి రాగిడి లక్ష్మారెడ్డి, మాజీ కార్పొరేటర్ మందడి శ్రీనివాస్‌రావు, పగుడాల బాబురావు, ముద్దం నర్సింహయాదవ్, పండాల సతీష్‌గౌడ్, తూము శ్రావణ్‌కుమార్, సబిహాబేగం, మహేశ్వరి, జూపల్లి సత్యనారాయణ, రంగారావు, శేరిలింగంపల్లి, కూకట్పల్లి నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ నేతలు పాల్గొన్నారు.
కేపీహెచ్‌బీ కాలనీలో హిందూ సంస్థ, హౌసింగ్ బోర్డు సంస్థలు కలిసి అపార్ట్మెంట్లు నిర్మించారు. 2011 లో అందులో ప్లాట్లను కొనుగోలు చేసి నివసిస్తున్నాం. ఓసీ, రిజిస్ట్రేషన్లు లేకుండానే జీహెచ్ఎంసీకి అప్పగించారు. దీనిపై హైకోర్టు, సుప్రీంకోర్టుకు వెళ్లి పోరాడుతున్నాం. అయితే అధికారులు కోర్టు ఆదేశాలను పట్టించుకోవడంలేదు. ఓసీ లేకపోవడంతో తాగునీటి బిల్లు 10 లక్షలు కట్టాల్సిన చోట.. పెనాల్టీతో కలిపి రూ.30 లక్షలు కట్టాల్సి వస్తుంది. దీనిపై ప్రభుత్వం స్పందించడం లేదు. మా సమస్యలను పరిష్కరించాలి.
రక్షణ రంగంలో పనిచేసిన ఉద్యోగులంతా కలసి 1985లో హైదర్‌నగర్ గ్రామంలో స్థలాన్ని కొనుగోలు చేశాం. ప్రభుత్వ అనుమతితో లేఅవుట్, ఇండ్ల నిర్మాణాలు చేసుకున్నాము. ప్రభుత్వ స్థలమని ఆనాడు ఎవరూ చెప్పలేదు. ఇప్పడు నిషేధిత జాబితాలో పెట్టడంతో రిజిస్ట్రేషన్లు, ఇంటి నిర్మాణ అనుమతులు నిలిపివేశారు. దీంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయని చెబుతున్న అధికారులు.. ఇప్పటివరకు మాకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు. సమస్య పరిష్కారం కాకుంటే కుటుంబాలతో కలిసి రోడ్డుపై కూర్చుంటాం.
వసంతనగర్ కాలనీలో 50 ఎండ్ల క్రితం ఇండ్ల స్థలాలు కొనుక్కొని నివా సం ఉంటున్నాం. కూకట్పల్లి మండలంలోని సర్వే నంబర్ 145, 163లో సుమారు 360 ఎకరాలను నిషేధ భూముల జాబితాలో పెట్టారు. దీనిపై కలెక్టర్, సీసీఎల్ఏ, రాష్ట్ర రెవెన్యూ మంత్రి, ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశాం. అధికారులను అడిగితే… సుప్రీంకోర్డు ఆదేశాలు అంటున్నారు… ఆ ఆదేశాలు ఎమిటో చెప్పడం లేదు. కోర్టు నుంచి మాకు ఎలాంటి నోటీసులు రాలేదు. మేము ఎవరిని కలిసినా సమాధానం చెప్పడం లేదు. ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలి.
చట్టప్రకారం భూములను కొనుగోలు చేసి ఇండ్లను నిర్మించుకున్నారు. 45 ఎండ్ల తర్వాత ఈ భూములను నిషేధిత జాబితాలో పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. సర్థార్ పటేల్ నగర్లో స్థలాలకు, ఇంటి నిర్మాణాలను ప్రభుత్వం 2008లో ఎల్ఆర్ఎస్, బీపీఎస్ ద్వారా క్రమబద్ధీకరించింది. మళ్లీ ఇప్పుడు అనుమతులు, రిజిస్ట్రేషన్లు నిలిపివేయడం సరికాదు. కషార్జితంతో ఆస్తులు కొన్న పేదలు, వృద్ధులు నిద్రలేని రాత్రుళ్లను గడుపుతున్నాం. బ్యాంకు రుణాలు రాక,.రిజిస్ట్రేన్లు లేక అల్లాడుతున్నాం. ప్రభుత్వం మా కాలనీలను 22ఏ నుంచి తొలగించాలి.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సొత్తును 22ఏ పేరుతో అమ్ముకుంటోంది. నాడు ఎమ్మెల్యే కృష్ణారావు కృషితో ప్రజల అవసరాల కోసం వదిలిన స్థలాలలో పార్కులు ఏర్పాటు చేయగా…నేడు భవిష్యత్ కమ్యూనిటీ అవసరాలకు ఎలాంటి స్థలాలు లేకుండా అమ్ముకుంటున్నారు. హౌసింగ్ బోర్డులో కమ్యూనిటీ అవసరాల కోసం వదిలిన స్థలాలు ప్రజల సొత్తు. వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. దశాద్దాలుగా నివసిస్తున్న కాలనీలను నిషేధిత భూములుగా పేర్కొనడం బాధాకరం. ప్రభుత్వం దిగివచ్చే వరకు సంఘటితంగా పోరాడుదాం..