Chennai Super Kings | షేర్లపై ధోనీకి ఆసక్తి లేదు.. వాటా అంశంపై అతడు మాతో మాట్లాడలె..!
Chennai Super Kings : భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ(MS Dhoni) ఐపీఎల్ భవితవ్యంపై అనిశ్చితి కొనసాగుతుండగా.. ఫ్రాంచైజీలో అతడు షేర్లు కొన్నాడనే వార్తలు ఇటీవల వైరలయ్యాయి. దాంతో ఈ విషయంపై ఫ్రాంచైజీ స్పందించింది.
Chennai Super Kings : భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ(MS Dhoni) ఐపీఎల్ భవితవ్యంపై అనిశ్చితి కొనసాగుతుండగా.. తదుపరి చెన్నై సూపర్ కింగ్స్ కోచ్ అతడేనా? అనే ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. ఈ ఉత్కంఠ కొనసాగుతుండగానే ధోనీ ఫ్రాంచైజీలో వాటా కొన్నాడనే వార్తలు ఇటీవల వైరలయ్యాయి. దాంతో ఈ విషయంపై ఫ్రాంచైజీ స్పందించింది. అసలు ధోనీకి తమను ఈ విషయం అడగలేదని, అతడికి ఆసక్తి కూడా లేదని వెల్లడించింది సీఎస్కే. అయితే.. మహీ భాయ్ మాత్రం వాటా కొనాలని భావించినట్టు కొన్ని కథనాలు చెబుతున్నాయి.
ఐపీఎల్‌లోనూ సారథిగా చెరగని ముద్ర వేసిన మహేంద్ర సింగ్ ధోనీ సీఎస్కేలో వాటా కొన్నాడనే వార్తలు చర్చనీయాంశంగా మారాయి. ఆరంభ సీజన్ నుంచి చెన్నై జట్టుకు కొండంత ఆస్తిలా మారిన ధోనీకి ఫ్రాంచైజీలో వాటా ఉందని కథనాలు రాగా యాజమాన్యం మాత్రం అదేం లేదంటోంది. ఫ్రాంచైజీలో వాటా కావాలని ధోనీ ఎప్పుడూ అడగలేదు. ఈ విషయాన్ని మేము చర్చించలేదు. వాటా అంశంపై యజమాని ఎన్ శ్రీనివాసన్‌తో ధోనీ మాట్లాడినట్టు కూడా మాకు తెలియదు అని సీఎస్కే అధికారి ఒకరు మీడియాతో అన్నారు. కానీ, ఆయన చెబుతున్నది అవాస్తమని, సీఎస్కే షేర్లు ధోనీ కొన్నాడని కొన్ని కథనాలు స్పష్టం చేస్తున్నాయి.
⚡️UPDATE⚡️
CSK deny reports of Dhoni’s interest in buying a stake in the franchise.
However, Dhoni does hold more than one lakh shares in CSK. pic.twitter.com/idQFZ82yrv
— Cricbuzz (@cricbuzz) September 11, 2026
ప్రైవేట్‌గా కొన్నాడా..?
చెన్నై సూపర్ కింగ్స్ షేర్లను అమ్మకానికి పెట్టినప్పుడు ధోనీ కొన్నాడట. అయితే.. బహిరంగ మార్కెట్లో మాత్రం ఫ్రాంచైజీ తమ షేర్లను విక్రయించలేదు. మరి.. అలాంటప్పుడు తాలా ఎలా కొన్ని షేర్లను కొన్నాడు? అనే సందేహం వస్తుంది అందరికి. మార్కెట్ జాబితాలో సీఎస్కే కంపెనీ రిజిష్టర్ కానందున.. ప్రైవేట్‌గా ధోనీ వీటిని కొన్నట్టు సమాచారం.
క్రిక్‌బజ్ కథనం ప్రకారం ఈ మాజీ కెప్టెన్ వద్ద లక్షకు పైగా షేర్లు ఉన్నాయి. వాటాదారుల పరంగా చూస్తే ధోనీ వద్ద ఉన్నవి చాలా తక్కువ. ప్రస్తుతం సీఎస్కే షేర్ల విలువ.. రూ.37.94 కోట్లు. ప్రస్తుతం అమెరికాలో ఉన్న ధోనీ ఈ నెలాఖరున స్వదేశం రానున్నాడు. అనంతరం చెన్నై తదుపరి కోచ్‌ను ఖరారు చేయడంలో ఫ్రాంచైజీతో చర్చించనున్నాడు మహీ భాయ్.
🚨CRICBUZZ EXCLUSIVE🚨
⚡️MS Dhoni to return from the US this month and meet the CSK management to take a call on next head coach
⚡️Sources say CSK have zeroed in on an overseas candidate
⚡️The candidate is also believed to be in talks with another franchise pic.twitter.com/TCEdE4yBT3
— Cricbuzz (@cricbuzz) September 11, 2026
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

