కేపీహెచ్‌బీ కాలనీ, అక్టోబర్ 21: కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థ పాలనా విధానాలను, బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ఇంటింటికి తిరిగి ప్రచారం చేసి మాగంటి సునీత గోపీనాథ్‌ను భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని మజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు అన్నారు.
జూబ్లీహిల్స్ ఎన్నికల సందర్భంగా మంగళవారం కూకట్పల్లి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌లో నిర్వహించిన సమావేశంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు, ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, సునీతాలక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కాంత్రి కిరణ్, భూపాల్‌రెడ్డి, పద్మాదేవేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, తిరుపతి రెడ్డి, ఒంటేరు ప్రతాప్‌రెడ్డి, ఆదర్శ్‌రెడ్డి, రాజనర్స్, కోఆరినేటర్ సతీష్ ఆరోరాలు పాల్గొన్నారు.