ఉప్పల్, సెప్టెంబర్ 28 : తెలంగాణ రాష్ర్టాంలోని దేవాలయాలను అభివృద్ధి చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. దేవుడిపై ఉన్న నమ్మకం, విశ్వాసమే సమాజాన్ని సన్మార్గంలో నడిపిస్తుందన్నారు. దేవాలయాల పునరుద్ధరణ కార్యక్రమంలో భాగంగా ఉప్పల్ శిల్పారామంలో ‘మన గుడి-మన బలం’ కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు.
మాజీ మంత్రి హరీశ్‌రావు, మాజీ గవర్నర్ దత్తాత్రేయ, ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ దేవాలయాలకు నిధులు ఇచ్చిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. ఆలయాల్లో సిబ్బందికి, అర్చకులకు వేతనాలు ఇచ్చి ఆదుకున్నామని గుర్తు చేశారు. కార్యక్రమంలో వేణుగోపాలచారి, దేవిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.