Harish Rao | ఖమ్మంలో మైనర్ అమ్మాయిపై జరిగిన సంఘటనపై కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం చాలా బాధాకరమని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. ఈ విషయమై ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత 4 రోజుల క్రితం ఖమ్మం పట్టణంలో జరిగిన ఘటన అత్యంత హృదయ విదారకమైన ఘటన. సభ్య సమాజం తలదించుకోవాల్సిన పరిస్థితి. అది అనుభవించిన వాళ్లకు ఆ కుటుంబానికి ఎంత దుఖం ఉంటుందో ఒకసారి మన గుండె మీద చేయి వేసుకొని ఆలోచిస్తే తెలిసి వస్తుంది. దీన్ని ప్రతీ ఒక్కరు కూడా ఖండించాల్సిన అవసరం ఉంది.
ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం, సమాజం, అందరూ కూడా ఆలోచించాల్సిన అవసరముందన్నారు హరీశ్ రావు. పాపం 12 ఏండ్ల స్కూల్కు వెళ్లే అమ్మాయి.. అభం శుభం తెలియని అమ్మాయి మీద ఇలాంటి సంఘటనలు జరిగితే ఇంతకు మనమెక్కడున్నాం. ఎటు పోతున్నామని బాధ కలుగుతుంది. కనీసం సంఘటన జరిగిన తర్వాత కూడా ప్రభుత్వ స్పందన ఎట్లా ఉందంటే చాలా బాధగా ఉంది. 12 ఏండ్ల అమ్మాయిపై ఇలాంటి సంఘటన జరిగితే ప్రభుత్వం స్పందించాల్సిన తీరు ఇదేనా..? అని నేనడుగుతున్నానన్నారు.
అమ్మాయి తిరిగి నడవలేని పరిస్థితిలో ఉన్నది. అమ్మాయికి బీఆర్ఎస్ పార్టీ పూర్తి అండగా ఉంటుంది. ఇటువంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా ఉండాలంటే ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టి, ఇలాంటి దారుణాలకు పాల్పడే మృగాలను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
ఖమ్మంలో మైనర్ అమ్మాయిపై జరిగిన సంఘటనపై,
కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం చాలా బాధాకరం!అమ్మాయి తిరిగి నడవలేని పరిస్థితిలో ఉన్నది.
అమ్మాయికి బీఆర్ఎస్ పార్టీ పూర్తి అండగా ఉంటుంది.
ఇటువంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా ఉండాలంటే
ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టి, ఇలాంటి దారుణాలకు పాల్పడే… pic.twitter.com/ye11cLAvd8— BRS Party (@BRSparty) June 11, 2026
Bharathiraja | ఇండియన్ సినిమా గమనాన్ని మార్చిన దిగ్గజం.. భారతీరాజా మృతి పట్ల ప్రధాని మోదీ సంతాపం
Sachin Pilot | మళ్లీ తెరపైకి రాజస్థాన్ కాంగ్రెస్ విభేదాలు.. గెహ్లాట్ వ్యాఖ్యలకు పైలట్ కౌంటర్
Peddi Collections | మొదటి వారంలోనే రూ.345 కోట్లు.. రూ. 400 కోట్ల దిశగా రామ్ చరణ్ ‘పెద్ది’