Timmapur | కరీంనగర్లో కలకలం.. ఎమ్మెల్యే పీఏ వేధింపులతో మాజీ సర్పంచ్ భర్త ఆత్మహత్యాయత్నం..!
తిమ్మాపూర్, జూలై 14: తిమ్మాపూర్ మండలం మహాత్మా నగర్లోని మానకొండూరు నియోజకవర్గం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ముందు మాజీ సర్పంచ్ భర్త ఆత్మహత్యకు ప్రయత్నించడం కలకలం రేపింది.
తిమ్మాపూర్, జూలై 14: తిమ్మాపూర్ మండలం మహాత్మా నగర్లోని మానకొండూరు నియోజకవర్గం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ముందు మాజీ సర్పంచ్ భర్త ఆత్మహత్యకు ప్రయత్నించడం కలకలం రేపింది. గన్నేరువరం మండలం గుండ్లపల్లి ఎక్స్ రోడ్డు మాజీ సర్పంచ్ భర్త బేతల్లి రాజేందర్ రెడ్డి ఎమ్మెల్యే పీఏ వేధింపుల కారణంగా ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు.
గుండ్లపల్లి ఎక్స్ రోడ్డు మాజీ సర్పంచ్ భర్త బేతల్లి రాజేందర్ రెడ్డికి గుండ్లపల్లిలో సిమెంట్ బ్రిక్స్ ఉంది. సోమవారం రాత్రి బెజ్జంకి మండలానికి చెందిన ఇద్దరు, గుండ్లపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి మద్యం సేవిస్తుండగా రాజేందర్ రెడ్డి వారిని ప్రశ్నించాడు. దీంతో వారి మధ్య గొడవ జరిగి కొట్లాటకు దారితీసింది. ఈ ఘటనపై సదరు వ్యక్తులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో మంగళవారం రాజేందర్ రెడ్డిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు సమాచారం. తనపై దాడి చేశారంటూ రాజేందర్ రెడ్డి సైతం ఫిర్యాదు చేయగా అవతలి వ్యక్తులపై కూడా కేసు నమోద అయింది.
అయితే.. ఈ గొడవలో ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ ప్రధాన అనుచరుడు, అదే గ్రామానికి చెందిన మురళీధర్ రెడ్డి జోక్యంతోనే తనపై ఎస్సీ ఎస్టీ కేసు అయ్యేలా చేశారనే విషయాన్ని మనసులో పెట్టుకున్నాడు రాజేందర్ రెడ్డి. మంగళవారం సాయంత్రం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముందు అతడు పెట్రోల్ పోసుకొని నిప్పంటిచుకున్నాడు. ఎమ్మెల్యే పీఏ మురళీధర్ రెడ్డి వల్లే తన భర్త ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడని రాజేందర్ రెడ్డి భార్య సమత మీడియాకు తెలిపింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Navratri Brahmotsavams | హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి దర్శనం
Supreme Court | ఇంటర్నెట్ వినియోగం పిల్లల ప్రాథమిక హక్కు : సుప్రీంకోర్టు
Post-Mortem Room: పోస్టుమార్టమ్ రూమ్లో లిక్కర్ పార్టీ.. వీడియో వైరల్ కావడంతో డాక్టర్ సస్పెన్షన్
SlumDog 33 Temple Road | షూటింగ్ పూర్తి చేసుకున్న పూరి- విజయ్ సేతుపతి ‘స్లమ్డాగ్ – 33 టెంపుల్ రోడ్!
Unemployees | వేసిందే తక్కువ పోస్టులు.. టీజీపీఎస్సీ ఎదుట నిరుద్యోగుల ఆందోళన.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

