KTR | హరీశ్ రావు కేసీఆర్ తయారు చేసిన ఒక సైనికుడు. కేసీఆర్‌కు ఈరోజు కాదు పార్టీ ఆవిర్భావం ముందు నుంచి ఒక రక్షణ కవచంలా అండగా నిలబడ్డ నాయకుడు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. హరీశ్ రావు మీద ఎప్పటి నుంచో ఈ పుకార్లు వస్తనే ఉన్నయి. ఆయన చెప్తనే ఉన్నడు పాపం. ఆయన ఒక్కసారి కాదు.. ఇప్పటికి కొన్ని వందల సార్లు చెప్పిండు. నాకు క్యారెక్టర్ ఇంపార్టెంట్.. నేను నీలాగా కాదు రేవంత్ రెడ్డి. నువ్వు నాలుగు పార్టీలు మారినోడివి.. నువ్వు మాట్లాడితే ఎట్లా..? అని కూడా చెప్పిండు. ఆయనను ఇంకా ఎన్నిసార్లు హరీశ్ రావుతో చెప్పిస్తరన్నారు.
ఈ దేశంలో, రాష్ట్రంలో శీలపరీక్షలు ఎవరికన్నా పెట్టాల్సింది ఉంటే అది రేవంత్‌రెడ్డికి.. ఎందుకంటే ఆయన లాగా మాకు లాలూచీ పడాల్సిన అవసరం లేదు. ఆ పరిస్థితి లేదని కేటీఆర్ స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డికి ఢిల్లీకి పోతే ఏం చేస్తడో.. నాకు తెలుసు, మీడియా మిత్రులకు కూడా తెలుసు. మీకు సిగ్గపడుతున్నరు.. చెప్తలేరు. ఆయన పొద్దున కాంగ్రెస్‌తో ఉంటడు.. సాయంత్రం బీజేపీతో ఉంటడు. ఆయన గురించి ఎవరికి తెలియదు.. రాత్రి పోయి బీజేపోళ్ల కాళ్లు పట్టుకుంటడు. పొద్దున్నంతా కాంగ్రెస్‌తో డ్రామా చేస్తడు. ఆయన కూడా హరీశ్ రావు గురించి మా నాయకుల గురించి.. కాబట్టి రేవంత్ రెడ్డి పార్టీ మార్పిడి గురించి ఎంత తక్కువ మాట్లాడితే ఆయన ఆరోగ్యానికి అంత మంచిదని సూచించారు.
హరీష్ రావు కేసీఆర్ తయారు చేసిన సైనికుడు
కేసీఆర్ గారికి పార్టీ ఆవిర్భావం కంటే ముందు నుండి రక్షణ కవచంగా నిలిచిన వ్యక్తి హరీష్ రావు
హరీష్ రావు మీద వచ్చిన పుకార్లను కొన్ని వందల సార్లు తిప్పి కొట్టాడు
నాకు క్యారెక్టర్ ఇంపార్టెంట్.. రేవంత్ రెడ్డి నాలుగు పార్టీలు పార్టీలో మారిండు,… https://t.co/KmNo5yXOmO pic.twitter.com/V7k3q56SnV
— Telugu Scribe (@TeluguScribe) July 11, 2026