న్యూఢిల్లీ, సెప్టెంబర్ 18 : బీజేపీ అధికారంలో ఉన్న దేశ రాజధాని ఢిల్లీలో మరో దారుణ ఘటన వెలుగుచూసింది. 17 ఏండ్ల బాలికను నలుగురు వ్యక్తులు గ్యాంగ్ రేప్ చేసి, దారుణంగా హత్య చేశారు. తర్వాత ఆమె మృతదేహాన్ని ఒక బహిరంగ ప్రదేశంలో పారేయడంతో కుక్కలు ఆమె శవాన్ని పీక్కుతిన్నాయి. హత్యాచారం జరిగిన కొన్ని రోజుల తర్వాత కుళ్లిపోయిన స్థితిలో మృతదేహం ఈ నెల 13న పోలీసులకు లభ్యమైంది. ఛిద్రమై కుళ్లిపోయి ఉన్న మృతదేహం ఆడోమగో కూడా తెలియని స్థితిలో వాయువ్య ఢిల్లీలోని కుషాక్ రోడ్ స్వరూప్నగర్లో జైపాల్ రాణా పొలంలో తమకు లభ్యమైనట్టు వారు చెప్పారు. అప్పటికే మృతురాలి శరీరంలోని కొన్ని భాగాలను కుక్కలు పీక్కుని తిన్నాయన్నారు. ఒక చేయి శరీరం నుంచి వేరు చేసి ఉందన్నారు. నిందితులు, బాలిక ఒకరికొకరు తెలిసిన వారేనని, నేరం జరిగిన రోజు నిందితులు, బాలిక టెంపోలో కలిసి ప్రయాణించారని, అందులోనే అందరూ తాగారని చెప్పారు. తర్వాత ఆ బాలికపై నలుగురూ అత్యాచారం చేసి, అనంతరం కత్తులతో పొడిచి చంపి, శవాన్ని ఒక పొలంలో పడేసి వెళ్లిపోయారు.
ఆ బాలిక అదృశ్యమైనట్టు ఆమె కుటుంబ సభ్యులు ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. ఇంట్లోంచి తరచూ బయటకు వెళ్లి కొన్ని రోజుల తర్వాత తిరిగి రావడం ఆమెకు అలవాటని, అందుచేత ఆమె కన్పించకపోయినా తాము పట్టించుకోలేదని కుటుంబ సభ్యులు తెలిపారు. ఘటనా స్థలిలోని 50 కు పైగా కెమెరాలను పోలీసులు పరిశీలించగా, ఒక టెంపో అనుమానాస్పదంగా కన్పించింది.15,16 తేదీల్లో విస్తృత గాలి ంపు జరిపి ఆ టెంపోను గుర్తించారు. డ్రైవర్ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా, ఆ ఘటనలో నలుగురి ప్రమేయం గురించి బయటపడింది. అందులో ముగ్గురు 16,17 ఏండ్ల మైనర్లు. హత్యకు ఉపయోగించిన రెండు కత్తులు, నిందితులు ధరించిన దుస్తులు, టెంపోను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.