Harish Rao | గురుకుల పాఠశాలల్లో పిల్లలకు పెట్టే గుడ్లు, పప్పులో రూ.2000 కోట్ల స్కామ్ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందని.. పిల్లలకు పెట్టే గుడ్లు, పప్పులో ఎవరైనా స్కామ్ చేస్తారా..? అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు ప్రశ్నించారు.
బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు (డిజిటల్) కార్యక్రమంలో హరీశ్ రావు మాట్లాడుతూ.. మంత్రి అడ్లూరి లక్ష్మణ్, పొన్నం ప్రభాకర్ నాకు ఛాలెంజ్ విసురుతున్నారు.. మేము కొన్నదే రూ.650 కోట్లకు కొంటే రూ.2000 కోట్ల స్కామ్ ఎక్కడి నుండి వచ్చిందని అంటున్నారు. మీ డిపార్టుమెంట్లో మంత్రులుగా ఉండి అసలు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలో ఉన్నారు. యూనిఫాంలు, టైల కోసం రూ. 1200 కోట్ల టెండర్ పిలిస్తే, ఉప్పులు, పప్పులు, చికెన్ కోసం రూ.800 కోట్ల టెండర్ పిలిచారు.. రెండు కలిపితే రూ.2000 కోట్లన్నారు. టెండర్లు పిలిచిన విషయం ఈ మంత్రులకు తెలియకపోతే మీరు ఏం పాలన చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదని హరీశ్ రావు అన్నారు.
ఎంత కొన్నారో, ఎంత టెండర్లు పిలిచారు తెలియలేదు అంటే మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను. ముఖ్యమంత్రే మొత్తం టెండర్లు పిలిచి ఆ అనుముల అన్నా తమ్ముళ్లు మొత్తం మింగుతున్నారు.. అందుకే మీకు ఏమీ తెలియదు. కోటిమంది మహిళలను కోటీశ్వర్లను చేస్తానని రేవంత్ రెడ్డి చెప్పాడు.. కోటి మంది మహిళలు కోటీశ్వర్లు కాలేదు కానీ అనుముల వారి నలుగురు అన్నా తమ్ముళ్లు మాత్రం కోటీశ్వర్లు అయ్యారని పేర్కొన్నారు.
గురుకుల పాఠశాలల్లో పిల్లలకు పెట్టే గుడ్లు, పప్పులో రూ.2000 కోట్ల స్కామ్ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది
పిల్లలకు పెట్టే గుడ్లు, పప్పులో ఎవరైనా స్కామ్ చేస్తారా?
మంత్రి అడ్లూరి లక్ష్మణ్, పొన్నం ప్రభాకర్ నాకు ఛాలెంజ్ విసురుతున్నారు.. మేము కొన్నదే రూ.650 కోట్లకు కొంటే రూ.2000 కోట్ల… pic.twitter.com/2NpcaHPDqg
— Telugu Scribe (@TeluguScribe) June 16, 2026