కాచిగూడ,నవంబర్ 2: బీసీ రిజర్వేషన్ల బిల్లును పార్లమెంట్లో అమోదించి,తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు, బీసీ జేఏసీ తెలంగాణ రాష్ట్ర కో అర్డినేటర్ గుజ్జ సత్యం డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్ బిల్లును 9వ షెడ్యూల్లో చేర్చాలని, బీసీ విద్యార్థి జేఏసీ దీక్షను విజయవంతం చేయాలని ఆదివారం కాచిగూడలో వాల్పోస్టర్ను అవిష్కరించారు. అనంతరం గుజ్జ సత్యం మాట్లాడుతూ కేంద్రం శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లోనే బీసీ బిల్లును 9వ షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేశారు.
బీసీ రిజర్వేషన్ బిల్లును అమోదించాలని డిమాండ్ చేస్తూ వచ్చే నెల 4వ తేదీ నుండి 8వ తేదీ వరకు జేఏసీ ఆధ్వర్యంలో ఓయూ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో నిరాహార దీక్షను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సైదులు, వంశీ, మధుయాదవ్, సంతోశ్, ప్రణయ్, ఖాసిం, అంజీ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.