సిటీబ్యూరో, అక్టోబరు 28 (నమస్తే తెలంగాణ): గ్రేటర్లో పేద, మధ్య తరగతి ప్రజలకు సొంతింటి కల ఆమడ దూరంలో ఉంది. రాష్ట్రంలోనే అతి పెద్ద స్థానిక సంస్థగా పేరుగాంచిన జీహెచ్ఎంసీ పరిధిలో ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని అటకెక్కించింది. బీఆర్ఎస్ హయాంలో పట్టణ పేదలకు పక్కా ఇండ్లను సమకూర్చాలన్న సంకల్పంతో డబుల్ బెడ్రూం ఇండ్ల పథకానికి శ్రీకారం చుట్టింది.
నిరుపేదలు ఆత్మగౌరవంతో జీవించాలన్న లక్ష్యంతో కేసీఆర్ సర్కారు 2015లో ఈ స్కీం కింద వంద శాతం సబ్సిడీతో రూ.9,714.59 కోట్లతో ఈ ప్రాజెక్టును చేపట్టింది. 111 లొకేషన్లలో లక్ష డబుల్ బెడ్రూం ఇండ్ల పథకాన్ని అమలు చేశారు. ఇందులో భాగంగానే వారున్న చోటే 27 ప్రాంతాల్లో (ఇన్సైట్)లో 5,363 మందికి, 39 లొకేషన్లలో 63,478 మంది లబ్ధిదారులకు డబుల్ బెడ్రూం ఇండ్లను అందజేసిన విషయం తెలిసిందే. లక్ష డబుల్ బెడ్రూం ఇండ్ల పథకంలో 66 లొకేషన్లలో మొత్తం 68,841 మందికి పట్టాలు అందజేశారు.
ఈ సీంకు దీటుగా ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం దరఖాస్తుల స్వీకరణకే పరిమితమైందని లబ్ధిదారులు వాపోతున్నారు. గడిచిన రెండేళ్లలో నిరుపేదలకు డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం కొత్తగా చేపట్టిన దాఖలాలు లేవని ప్రజలు మండిపడుతున్నారు. ముఖ్యంగా 30 సరిళ్లలో ఏకంగా పది లక్షల దరఖాస్తులు వచ్చినట్లు జీహెచ్ఎంసీ అధికారులు వెల్లడించారు. దరఖాస్తుల స్వీకరణ ముగిసిన వెంటనే సర్వే నిర్వహించి అర్హులను, అనర్హులను గుర్తించి సరారుకు నివేదిక పంపించినప్పటికీ లబ్ధిదారులకు ఎదురుచూపులు తప్పడం లేదు.
ఇందిరమ్మ ఇండ్ల సీం కోసం సుమారు పది లక్షల దరఖాస్తులను స్వీకరించి, వాటిని మూడు క్యాటగిరీలుగా విభజించి సర్వే నిర్వహించారు. వీరిలో కేవలం 18 వేల మందికి సొంత ఇండ్లు నిర్మించుకునేందుకు కావాల్సిన స్థలమున్నట్లు మొదటి క్యాటగిరీగా గుర్తించారు. తర్వాత సొంత స్థలాలున్నా, పకా ఇళ్లు లేని వారిని రెండో క్యాటగిరీగా గుర్తించారు. మూడో క్యాటగిరీగా సొంత ఇల్లు, స్థలం లేని 8 వేల మందిని గుర్తించారు. మొత్తం దరఖాస్తుల్లో కేవలం 18 శాతం మంది అసలైన లబ్ధిదారులుగా గుర్తించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. సరారు నివేదికలను పంపిన సమయంలో లబ్ధిదారుల సంఖ్య చాలా తగ్గిందని ప్రభుత్వం అసంతృప్తి వ్యక్తం చేసిందన్న ప్రచారం ఉంది.
పైగా కోటి మంది జనాభా కలిగిన గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కేవలం 18 వేల మంది లబ్ధిదారుల సంఖ్య చాలా తకువని, అర్హులైన ప్రతి ఒకరికీ వైట్ రేషన్ కార్డు మంజూరు చేసిన తర్వాత రీ సర్వే నిర్వహించి లబ్ధిదారుల సంఖ్యను అప్డేట్ చేయాలని సరారు భావించినప్పటికీ ప్రస్తుతం ఈ విషయాన్ని అధికారులు గానీ, పాలకులు గానీ ఎవరూ ప్రస్తావించటం లేదని దరఖాస్తుదారులు వాపోతున్నారు. ఇందిరమ్మ ఇండ్ల సీం కు వచ్చిన దరఖాస్తులపై గతంలో నిర్వహించిన సర్వే జరిగే నాటికి కొత్త రేషన్ కార్డులు చాలా మందికి లేకపోవటంతో వారంతా అనర్హులుగా గుర్తించినట్లు సమాచారం. ఇప్పుడు కొత్తగా తెల్లరేషన్ కార్డులను మంజూరు చేసున్నందున మరో సారి సర్వే నిర్వహిస్తే లబ్ధిదారుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని దరఖాస్తుదారులు చెబుతున్నారు.
