హైదరాబాద్ : మాజీ మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్‌నుTalasani Srinivas yadav) హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ(Governor Bandaru Dattatreya) పరామర్శించారు. ఇటీవల మరణిం చిన తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడు శంకర్ యాదవ్(Shankar yadav) నివాసానికి వెళ్లిన గవర్నర్ దత్తా త్రేయ శంకర్ యాదవ్ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు(Tribute) అర్పించారు. కుటుంబ సభ్యు లను పరామర్శించి తన ప్రగాఢ సంతాపం, సానుభూతి తెలిపారు.
మోండా మార్కెట్ అధ్యక్షుడిగానే కాకుండా బోయిన్ పల్లి మార్కెట్ ట్రేడర్స్ అధ్యక్షుడిగా కూడా పని చేసిన శంకర్ యాదవ్ అటు ట్రేడర్స్, ఇటు కార్మికులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరి ష్కారానికి పాటుపడ్డారని గుర్తు చేశారు. కాగా, మోండా మార్కెట్ చైర్మన్ తలసాని శంకర్ యాదవ్ మరణిం చారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సికింద్రాబాద్ యశోదలో చికిత్స పొందు తున్నారు. ఈ క్రమంలో పరిస్థితి విషమించడంతో కొద్ది రోజుల క్రితం కన్నుమూశారు.