మెహిదీపట్నం, నవంబర్ 14 : సదర్ యాదవుల భక్తికి ప్రతీక అని ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ ఎం.ఎస్.ప్రభాకర్ రావు అన్నారు. నాంపల్లి నియోజకవర్గం పటేల్‌నగర్ ఏడుగుళ్ల పోచమ్మ ఆలయం వద్ద యాదవ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఉత్సవాలకు ఎమ్మెల్సీ ప్రభాకర్ రావు, నాంపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి సీహెచ్.ఆనంద్‌కుమార్ గౌడ్‌తో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభాకర్ రావు మాట్లాడుతూ.. ప్రజలకు సీఎం కేసీఆర్ అందించిన సంక్షేమ కార్యక్రమాలు దేశానికే ఆదర్శం అన్నారు. అన్ని పండుగలను అత్యంత వైభవంగా నిర్వహించుకునేలా చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కు దక్కుతుందని పేర్కొన్నారు.
కార్వాన్ నియోజకవర్గం లంగర్‌హౌస్‌లో జరిగిన సదర్ ఉత్సవాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మిత్ర కృష్ణ, బీఆర్ఎస్ రాష్ట్ర యువ నాయకులు తూంకుంట అరుణ్‌కుమార్, అభిషేక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మిత్ర కృష్ణ దున్నపోతుల విన్యాసాలను తిలకించి వాటిని పూజించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షులు చంద్రకాంత్, నాయకులు ఆరెళ్ల కృష్ణాయాదవ్, జగదీశ్ యాదవ్, శ్రీశైలం యాదవ్, వెంకటేశ్ యాదవ్ పాల్గొన్నారు.
కార్వాన్, నవంబర్ 14 : సదర్ కార్వాన్లో కన్నుల పండువగా సాగింది. కార్వాన్ చౌరస్తాలో దర్బార్ మైసమ్మ ఆలయ ప్రాంగణం వద్ద కార్వాన్ యాదవ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేదిక వద్దకు కార్వాన్, గుడిమల్కాపూర్, జియాగూడ నుంచి యాదవులు తమ దున్నలను సుందరంగా తయారు చేసి బ్యాండు, మేళాలతో, విద్యుత్ దీప కాంతులతో ఆడుతూ. పాడుతూ ఉత్సాహంగా తీసుకువచ్చారు.
యాదవులను కార్వాన్ యాదవ్ సంఘం సభ్యులు శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో కార్వాన్ బీఆర్ఎస్ అభ్యర్థి మిత్ర కృష్ణ, బీజేపీ అభ్యర్థి అమర్ సింగ్, బీఆర్ఎస్ నాయకుడు గడ్డం శ్రీనివాస్ యాదవ్, బీజేపీ రాష్ట్ర నాయకుడు సి.అశోక్ కుమార్ యాదవ్, గోల్కొండ జిల్లా బీజేపీ అధ్యక్షుడు ఉష్కెల పాండు యాదవ్, కార్వాన్ కార్పొటర్ స్వామి యాదవ్, జియాగూడ కార్పొరేటర్ బోయిని దర్శన్, కార్వాన్ బీఆర్ఎస్ ఇన్చార్జి ఠాకూర్ జీవన్ సింగ్, మాజీ కార్పొరేటర్ బంగారి ప్రకాశ్, కార్వాన్ యాదవ్ సంఘం అధ్యక్షుడు బోడి అశోక్ కుమార్ యాదవ్‌తో పాటు ప్రతినిధులు ప్రేం కుమార్ యాదవ్, ఆకుల రాజగోపాల్ యాదవ్, సందేశ్ యాదవ్, సుధాకర్ యాదవ్, లక్ష్మణ్ యాదవ్, రఘువీర్ యాదవ్, వినోద్ యాదవ్, రాధాకృష్ణ యాదవ్, శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు.
తాళ్ళగడ్డలో యాదవ యువసేన ఆధ్వర్యంలో నిర్వాహకులు స్వాగత వేదిక ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో జీవన్ సింగ్, గడ్డం శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. యాదవ యువసేన ప్రతినిధులు ఆకుల ఆదిత్య యాదవ్, శశికాంత్, ఆశిష్ యాదవ్, బంటి యాదవ్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. సౌత్ వెస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి, కుల్సుంపుర డివిజన్ ఏపీపీలు ఎంఏ. జావిద్ ఆధ్వర్యంలో టప్పాచబుత్రా ఇన్స్పెక్టర్ సీహెచ్ శ్రీనివాస్, డీఐ ఆసిఫ్, ఎస్సైలు అంబేద్కర్, ఆదిల్ సిబ్బందితో బందోబస్తు పర్యవేక్షించారు.