కందుకూరు, జనవరి 21 : బీజేపీ, కాంగ్రెస్ పార్టీల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ప్రతి పక్షాల విమర్శలను తిప్పికొట్టాలని బీఆర్ఎస్ శ్రేణులకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సూచించారు. కందుకూరు మండల బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం మండల పరిధిలోని గుమ్మడవెల్లి గ్రామంలోని ఫంక్షన్ హలులో గుమ్మడవెల్లి, ఆకులమైలారం, మీర్ఖాన్పేట్, బేగరికంచె, అన్నోజిగూడ, మాదాపూర్, రాచులూరు, తిమ్మాపూర్, లేమూరు, జబ్బారుగూడ, బైరాగిగూడ, అగర్మియగూడ, సరస్వతీగూడ, కొలనుగూడ, తదితర గ్రామాల నాయకులు, కార్యకర్తలతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల పాలిత రాష్ర్టాలో మన రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలను ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. ప్రతి రోజు సీఎం కేసీఆర్‌ను విమర్శించడం కాదని అభివృద్ధిని చూడాలన్నారు.ప్రభుత్వ పథకాలను ఇంటింటికి తీసుకవెల్లాలని పేర్కొన్నారు. స్వర్గీయ యాదయ్య విగ్రహం ఏర్పాటు కోసం కృషి చేస్తానని మంత్రి తెలిపారు. ఈ సమావేశంలో ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి, రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ చైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డి, జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి, పీఎసీఎస్ చైర్మన్ దేవరవెట్టి చంద్రశేఖర్, రైతు విభాగం మండల అధ్యక్షుడు అమరేందర్ రెడ్డి, బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు మన్నే జయేందర్ ముదిరాజ్, మండల ఉపాధ్యక్షుడు మహేందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.