మంగళవారం 02 మార్చి 2021
Hyderabad - Jan 27, 2021 , 05:42:59

తెలుగు భాషకు ప్రాణం పోసిన మహనీయుడు ‘గిడుగు’

తెలుగు భాషకు ప్రాణం పోసిన మహనీయుడు ‘గిడుగు’

చిక్కడపల్లి, : తెలుగు భాషకు ప్రాణం పోసిన మహనీయుడు గిడుగు రామ్మూర్తి పంతులు అని తెలంగాణ మావన హక్కుల కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ చంద్రయ్య అన్నారు. ‘గిడుగు రామమూర్తి పంతులు ఫౌండేషన్‌' ఆధ్వర్యంలో మంగళవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో గిడుగు రామ్మూర్తి 81వ వర్ధంతి సభను నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జస్టిస్‌ జి.చంద్రయ్య హాజరై ప్రసంగించారు. తెలుగు భాషకు ప్రాణం పోసిన మహానీయుడు గిడుగు రామమూర్తి పంతులని, ఆయన సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా జీవన సాఫల్య పురస్కారాలను సుధామ, డాక్టర్‌ సీహెచ్‌ సుశీలమ్మ, గిడుగు సాహితీ పురస్కారాలను ఏనుగు నరసింహారెడ్డి, మధుకర్‌ వైద్యుల తదితరులకు ప్రదానం చేశారు. అదే విధంగా గిడుగు సాహితీ, కళా, సేవా పురస్కారాలను ప్రదానం చేశారు. కళారత్న బిక్క కృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఫౌండేషన్‌  వ్యవస్థాపక అధ్యక్షురాలు గిడుగు లక్ష్మీకాంతి, తెలంగాణ బీసీ కమిషన్‌ పూర్వ సభ్యులు వకుళాభరణం కృష్ణమోహన్‌, తెలంగాణ రచయితల సంఘం డాక్టర్‌ నాళేశ్వరం శంకరం, యూజీఎస్‌ నెట్‌వర్క్‌ జాతీయ ఉపాధ్యక్షుడు డి.లక్ష్మణ్‌, సంఘ సేవకురాలు గిడుగు సరస్వతి, రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి, శశిబాల తదితరులు పాల్గొన్నారు. 

VIDEOS

logo