సిటీబ్యూరో, నవంబర్ 12(నమస్తే తెలంగాణ): ప్రభుత్వం చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సమగ్ర సర్వేలో భాగంగా జీహెచ్ఎంసీ వ్యాప్తంగా నాలుగు రోజుల వ్యవధిలో 2,98,374 కుటుంబాలు సర్వే పూర్తి చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. సోమవారం నాటికి 1,58, 150 కుటుంబాలు కాగా.. మంగళవారం 1,40,224 కుటుంబాల్లో సర్వే చేపట్టినట్లు తెలిపారు. జీహెచ్ఎంసీ కో ఆర్డినేటర్ అధికారిగా హెచ్ఎండీఏ కమిషనర్ సర్పరాజ్ అహ్మద్ వ్యవహరిస్తున్నట్లు పేర్కొన్నారు. కుటుంబ సర్వే పూర్తయిన వెంటనే వివరాలు డేటా ఎంట్రీ సర్కిల్ స్థాయిలో చేసేందుకు ఏజెన్సీని గుర్తించారు. ఫారాలను భద్రపరించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసేందుకు ఆదేశాలు జారీ చేశారు. డేటా ఎంట్రీ అయిన ఫారాలు బయటకు వెళ్లకుండా చర్యలు తీసుకోవాల ని అధికారులకు ఆదేశాలు చేశారు.