సిటీబ్యూరో, కేపీహెచ్‌బీ కాలనీ, జూన్ 3 (నమస్తే తెలంగాణ) : వాకర్స్ సౌకర్యార్థం ఏర్పాటు చేసిన పనులను వెంటనే పూర్తి చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కమిషనర్ అధికారులతో కలిసి కేబీఆర్ పార్కులో చేపట్టిన పనులను పరిశీలించారు. లైసెన్స్ తీసుకున్న పెట్ డాగ్స్‌ను మాత్రమే పార్కులోకి తీసుకురావాలని ఆదేశించారు.
కేబీఆర్ పార్కు చుట్టూ హెచ్ సిటీ ద్వారా చేపట్టే ఫ్లై ఓవర్లు, అండర్‌పాస్‌లు కోర్డు ఆదేశాల మేరకు నిర్మిస్తున్నారా అంటూ ప్రాజెక్టు ఇంజినీరింగ్ అధికారులను వివరణ కోరగా, సెన్సిటివ్ జోన్ పరిధిలోనే పనులు చేపట్టినట్లు ప్రాజెక్టు ఇంజినీర్లు కమిషనర్‌కు వివరించారు. కమిషనర్ వెంట అడిషనల్ కమిషనర్ సుభద్ర దేవి, డీసీ సమ్మయ్య, ప్రాజెక్టు ఈఈ మాన్య నాయక్, ఎస్ఈ శ్రీ లక్ష్మి, డిప్యూటీ ఈఈ హరీశ్, సర్కిల్ ఈఈ విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.