GHMC | బల్దియా బడ్జెట్ 8,437 కోట్లు.. ఆమోదించనున్న సభ్యులు
జీహెచ్ఎంసీ 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ ముసాయిదాను సోమవారం మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన జరిగే కౌన్సిల్ సమావేశంలో ప్రవేశపెట్టనున్నారు.
- రెండు కేటగిరీలుగా పద్దు
- ఏ కేటగిరీలో రూ. 7,937 కోట్లు
- బీ కేటగిరీలో రూ. 500కోట్లు
- గతేడాది కంటే రూ. 2,213కోట్లు అదనం
- నేడు కౌన్సిల్లో చర్చ..
GHMC | సిటీబ్యూరో, ఫిబ్రవరి 18 (నమస్తే తెలంగాణ): జీహెచ్ఎంసీ 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ ముసాయిదాను సోమవారం మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన జరిగే కౌన్సిల్ సమావేశంలో ప్రవేశపెట్టనున్నారు. 2023-24 సంవత్సరానికి బడ్జెట్ రూ. 6,224 కోట్లుగా ప్రతిపాదించగా, రాబోయే ఆర్థిక సంవత్సరానికి అధికారులు రూ. 8437 కోట్లుగా ఖరారు చేశారు. మారిన అవసరాలు, పెరిగిన ఖర్చులు వంటివి దృష్టిలో ఉంచుకొని గతేడాది కంటే ఈ సారిగా అదనంగా రూ. 2,213 కోట్ల పద్దును పెంచారు. గతంలో మాదిరిగానే బడ్జెట్ను రెండు భాగాలుగా (ఏ, బీ) రూపొందించారు.
ఈ సారి కూడా హెచ్ఎంసీది ఏ విభాగం కింద ఉండగా, డబుల్బెడ్రూం ఇండ్ల కోసం అందే నిధులను ‘బీ’ కేటగిరీగా చేర్చారు. ఏ కేటగిరీలో రూ.7,937కోట్లు, ‘బీ’ కేటగిరీలో డబుల్ బెడ్రూం ఇండ్లకు రూ. 500 కోట్లు కేటాయించారు. కాగా, కౌన్సిల్లో ఈ బడ్జెట్ ప్రతిపాదనపై సభ్యులు విస్తృతంగా చర్చించనున్నారు. ఆ తర్వాత కౌన్సిల్ సభ్యులు ఆమోదించిన తర్వాత అధికారులు ఈ బడ్జెట్ ప్రతిపాదనను ప్రభుత్వానికి అందజేసి అనుమతి తీసుకుంటారు.

Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

