ఫలక్‌నుమాలో రూ.5.95 కోట్లతో ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్
జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సమావేశం బుధవారం మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన జరిగింది. ఈ స్టాండింగ్ కమిటీ కమిటీ సమావేశంలో 11 అంశాలకుగానూ 11 అంశాలకు సభ్యులు ఆమోదం తెలిపారు.
- రూ. 41 కోట్లతో 14 థీమ్ పార్కుల అభివృద్ధి
- నల్లగండ్ల హుడా లే అవుట్లో 40 ఫీట్ల రోడ్డు
- పలు చోట్ల చెరువుల వద్ద మురుగునీటి మళ్లింపు పనులు
- స్టాండింగ్ కమిటీ సమావేశంలో 11 అంశాలకు గ్రీన్ సిగ్నల్
సిటీబ్యూరో, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ) : జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సమావేశం బుధవారం మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన జరిగింది. ఈ స్టాండింగ్ కమిటీ కమిటీ సమావేశంలో 11 అంశాలకుగానూ 11 అంశాలకు సభ్యులు ఆమోదం తెలిపారు. ఈ స్టాండింగ్ కమిటీ సభ్యులు శాంతి సాయిజెన్ శేఖర్, సయ్యద్ మిన్హాజుద్ధీన్, సమీనా బేగం, అబ్దుల్ వాహెబ్, మహ్మద్ అబ్దుల్ ముక్తధర్, మహ్మద్ రషీద్ ఫరాజుద్దీన్, వనం సంగీతాయాదవ్, పండల సతీశ్‌బాబు, ఈఎస్ రాజ్, జితేంద్రనాథ్, టి.మహేశ్వరి తదితరులు పాల్గొని పలు అభివృద్ధి పనులకు ఆమోదం తెలిపారు.
ఆమోదం పొందినవి…
- శేరిలింగంపల్లి మండలం నలగండ్లలో సర్వే నం 442, 443, 444 లోని హుడా లే అవుట్లో 40 ఫీట్ల రోడ్డు.
- ఖైరతాబాద్ జోన్లో రూ.41 కోట్లతో 14 థీమ్ పార్కులను అభివృద్ధి చేసేందుకు నిర్ణయించారు. అందులో మూడు ప్రదేశాల్లో పార్కుల ఏర్పాటుకు అనుకూలంగా లేనందున ఇతర స్థలాలను గుర్తించి అక్కడ థీమ్ పార్కులను ఏర్పాటు చేయనున్నారు.
- మన్సూరాబాద్‌లో సహారా కాంపౌండ్ వాల్ కల్వర్టు నుంచి జీఎస్ఐ రోడ్డు కల్వర్టు 2 బీహెచ్‌కే అపార్ట్మెంట్ దగ్గర రూ.6 కోట్ల అంచనా వ్యయంతో స్మార్ట్ వాటర్ బాక్స్ డ్రెయిన్ నిర్మాణానికి టెండర్లు పిలుస్తారు.
- ఫలక్‌నుమా ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో రూ. 5.95 కోట్లతో పెవిలియన్, ఇండోర్ స్పోర్ట్స్ భవన నిర్మాణం.
- జీడిమెట్ల బషీర్‌బాగ్‌లో ఏర్పాటు చేసిన దండముడి ఎన్‌క్లేవ్‌లో అంతర్గత రోడ్డు విస్తరణ పనులు
- గాజుల రామారంలో చింతల్ చెరువు డ్రైనేజీ మళ్లింపునకు రూ.2.23కోట్లతో టెండర్లు
- గాజుల రామారం మద్దెల కుంట చెరువు రూ.2.15 కోట్ల డ్రైనేజీ మళ్లింపు పనులకు షార్ట్ టెండర్
- కుత్బుల్లాపూర్ లాల్‌సాబ్‌గూడ, రామన్న చెరువు డ్రైనేజీ మళ్లింపునకు రూ.2.77కోట్ల పనులకు షార్ట్ టెండర్ పిలిచేందుకు అనుమతి
- గాజుల రామారం బండ చెరువు డ్రైనేజీ మళ్లింపునకు రూ.2.36 కోట్ల పనులకు షార్ట్ టెండర్
- గచ్చిబౌలిలో పికాక్ లేక్ మురుగు మళ్లింపు పనులకు రూ.2.96కోట్లతో టెండర్లు పిలుపు
- ఎగ్జామినర్ ఆఫ్ అకౌంట్ ఫిబ్రవరి మాసం రసీదులు, ఖర్చుల వివరాలు సమర్పించిన నివేదికలకు ఆమోదం తెలిపారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KCR | ఇదిగో కేసీఆర్ ముందుచూపు.. కరువులోనూ నీళ్లు పారేలా ప్రణాళిక
Singareni | జై కొట్టిన సింగరేణి.. జాతరను తలపించిన నల్లనేల
Harish rao | పాలమూరుకు పట్టిన గ్రహణం రేవంత్.. హరీశ్ రావు
Medicover Hospital | మెడికవర్.. రేవంత్ బినామీ దవాఖాన : కేతిరెడ్డి వాసుదేవరెడ్డి
Blue Drum Case | బ్లూ డ్రమ్ కేసులో భార్య, ప్రియుడికి మరణ శిక్ష.. మీరట్ కోర్టు సంచలన తీర్పు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

