హైదరాబాద్ : బీఆర్ఎస్ పార్టీ పేద ప్రజల పక్షాన పోరాడుతుందని బీఆర్ఎస్వీ నాయకులు గెల్లు శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మంగళవారం బీఆర్ఎస్వీ నాయకులతో కలిసి జియాగూడ కమేలను సందర్శించారు. ఈ సందర్భంగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. ప్రభుత్వానికి కమేల తెరిచేలా ఆదివారం వరకు గడువు ఇచ్చామని, ఆ తరువాత తామే దగ్గర ఉండి కమీలలో పేద ప్రజలు వ్యాపారాలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటామన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదలకు నిలువనీడ లేకుండా చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్నట్లు ఆయన తెలిపారు.