దుండిగల్, జనవరి 24 : షార్ట్‌సర్క్యూట్ కారణంగా ఫుడ్ కోర్టులోని ఓ టిఫిన్సెంటర్లో వంటగ్యాస్ లీకవ్వడంతో భారీ పేలుడు సంభవించింది. టిఫిన్ సెంటర్‌తో పాటుతో పక్కనే ఉన్న మరో మూడు దుకాణాలు దగ్ధమయ్యాయి. నిజాంపేట్-బాచుపలి ప్రధాన రహదారిలోని హెచ్‌పీ పెట్రోల్ బంక్ సమీపంలోని ఓ పుడ్కోర్టులోని టిఫిన్సెంటర్లో శుక్రవారం ఉదయం వంట పనులను ప్రారంభిస్తూ స్టవ్‌ను వెలిగించగా అప్పటికే వంట గ్యాస్లీకవ్వడంతో ఒక్కసారిగా అగ్నికీలలు ఎగిసిపడ్డాయి.
వెంటనే పక్కనున్న మరో మూడు దుకాణాలకు మంటలు అంటుకుని వాటిలో సిలిండర్లు కూడా భారీ శబ్దంతో పేలిపోయి మంటలు భారీగా ఎగిసిపడ్డాయి. అయితే..పక్కనే ఉన్న పెట్రోల్ బంక్‌కు మంటలు వ్యాపించకపోవడంతో పెను ప్రమాదం తప్పినైట్టెంది. సమాచారం అందుకున్న కూకట్పల్లి అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు.